21, ఫిబ్రవరి 2007, బుధవారం

బిల్ గేట్స్ ఇండియా పర్యటనబిల్ గేట్స్ ఇండియాలోని టెక్నాలజీ గురించి, సాప్ట్ వేర్ అభివృద్దిని గురించి తెలుసుకోవడం కోసం నాలుగు రోజుల పర్యటనపై ఇండియా బయలుదేరాడు. బెంగుళూరుకి ఫ్లైటులో చేరుకుని కారులో హోటల్ కి బయలుదేరమన్నాడు డ్రైవర్ ని… సెక్రటరీ చిన్న నవ్వు నవ్వి.. సార్ ఇక్కడి నుండి టెక్నాలజీ మీట్ సమావేశానికి వెళిపోతున్నాం అన్నాడు. అదేంటి అది ఇంకా నాలుగు గంటల తరువాత కదా ఇప్పట్నుండి ఎందుకు, ఏంటి అంతదూరం ఉంటుందా మనం వెళ్ళవలసింది ? అన్నాడు అమాయకంగా బిల్ గేట్స్ . బెంగుళూరులో ఇంతే సార్.. ట్రాఫిక్ జామ్ ఇప్పుడు బయలుదేరితే ఆ సమయానికి చేరుకుంటాం అన్నాడు.

డ్రైవర్ మిర్రర్ లో బిల్ గేట్స్ అమాయకపు మొహం చూస్తూ… బెంగుళూరుకి కొత్త అనుకుంట పాపం… అని ముసిముసిగా నవ్వుకున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. డ్రైవర్. దిగి.. సార్ నేను ఒక అరగంట అలా ఇలా తిరిగి వస్తాను… మీరు వస్తారా? అని అడిగాడు.. హా.. … ఏంటి అంటే అరగంట వరకూ ఇక్కడనుండి కదలలేమా. అని నోరెళ్ళబెట్టాడు. ఇది మాములే సార్ పదండి వెళదాం అక్కడ రోడ్డుప్రక్కన దోశలు వేస్తారు చాలా బాగుంటాయి అని ఆహ్వానించాడు సెక్రటరీ.

అలా నడుస్తూ వెళ్ళి దోశలు ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడ చూసినా జనం రోడ్డు ప్రక్కన లాప్ టాప్ ల్లో మొహాలు పెట్టి సీరియస్ గా ఎదో చేసేస్తున్నారు.. ఏంటిది.. ఇంత డవలెప్ మెంట్ ఉందా ఐటికి అని అడిగాడు సెక్రటరీనీ. అవునుసార్ వీళ్ళంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లు సార్. సాయంత్రం నైట్ షిప్ట్ కోసం పొద్దున్నే బయలుదేరిపోతారిలా ఆఫీసుకు.. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ లా , వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ జామ్స్ అన్న మాట. అని చెప్పాడు సెక్రటరీ.. అవును నిజమే ఎటుచూసినా సాప్ట్ వేర్ ఇంజనీరులే కనిపిస్తున్నారు.. అయితే మన ఈ ఐటి కి ఇక్కడ మంచి పేరుందిలా ఉందే అన్నాడు గర్వంగా.

అవునండీ ఒక సంవత్సరం క్రితం చెప్పుకునేవారు బెంగుళూరులో ఒక రాయి విసిరితే అయితే కుక్కకి లేదా సాప్ట్ వేర్ ఇంజనీరుకి తగులుతుంది అని.. కాని ఇప్పుడు రాయివేస్తే కచ్ఛితంగా సాప్ట్ వేర్ ఇంజనీరుకు తగులుతుంది అంటున్నారు అంతా.. నేనూ ఇప్పుడు అది నిజం అని నమ్ముతాను సార్ అన్నాడు సెక్రటరీ నవ్వుతూ.

కాసేపటికి ట్రాఫిక్ కదలడం మొదలయ్యింది.. హమ్మయ్యా అనుకుంటూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళేసరికి

వేలమంది జనం లైన్లలో నిలబడి ఉన్నారు ఒకచోట… ఇక్కడ ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టుందయ్యో ఆ జనం అది చూస్తే నాకు భయంగా ఉంది అన్నాడు బిల్ గేట్స్, డ్రైవర్ ని వేరే రూట్ నుండి పోనివ్వమని చెప్పు అన్నాడు సెక్రటరీతో. కాదు సార్ అది జాబ్ ఫేయిర్. వీళ్ళంతా మన రేపటి ఐటి పౌరులు సార్.. అదిగో చూడండి… అక్కడ టెక్నాలజీ కి తగ్గట్టుగా లైను కట్టారు… , సార్ మనలో మన మాట.. జావాలైనుకన్నా మన టెక్నాలజీస్ లైనే పెద్దదిగా ఉంది సార్… ఇక నుండి మనం ఏ కొత్త టెక్నాలజీ రిలీజ్ చేసినా ఆన్ లైన్ ఫోరమ్స్ , ఒపినీయన్ పోల్స్ వేస్ట్ సార్ ఇక్కడ లైను పొడవు చూస్తే చెప్పొచ్చు సార్ హిట్టో ప్లాపో.., అని పొంగిపోతూ చెప్పాడు సెక్రటరీ.

రూటుమార్చి ప్రక్క రోడ్డునుండి ఎలాగైతే టైముకు సమావేశానికి చేరుకున్నారు. బిల్ గేట్స్ భావోద్వేగంతో బెంగుళూరుని... ఇండియాని పొగిడేసి త్వరలో భారతదేశానికి వస్తున్న కొత్త ప్రాజెక్టులు, పధకాల గురించి పెద్ద వ్యాసం చదివేసాడు.

సాయత్రం హైదరాబాదుకు వెళదాం, ఎవరినీ కలిసేది లేదు కానీ, ఒక సామాన్య వ్యక్తిలా తిరుగుదాం.. అక్కడ కూడా ఎలా ఉందో చూద్దాం పద, అని ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు.

హైటెక్ సిటీ ఆ ప్రదేశాలు తిరిగి తిరిగి.. చాలా మారిపోయింది.. అంతా మన ఐటి చలవే అని ఆనందపడిపోయాడు..

సరే అమీర్ పేట్ వెళదాం అక్కడ ఐటి చాలా ఫేమస్ అంట కదా అని బయలుదేరారు.

అమీర్ పేట్ సెంటరుకి చేరుకునేసరికి డ్రైవరు సార్ ఈ సందులోకే మనం వెళ్ళాలి సార్ కానీ కారు వెళ్ళదు అన్నాడు.

ఏ.. ఇరుకు సందా? లేక రోడ్ బాగోదా అని అడిగాడు సెక్రటరీ డ్రైవరును. కాదు సార్ అటు చూడండి అని ఆ సందు దగ్గరగా కారు ఆపి చూపించాడు. రోడ్డంతా పాంపెట్లతోటీ నిండి పోయింది. పైన ఎడ్వర్టైజుమెంట్ బ్యానర్ల తలకి తగిలేలా కట్టేసి ఉన్నాయి ఎటుచూసినా..

ఏంటయ్యా ఇది అని అడిగాడు సెక్రటరీని.. సార్ ఇక్కడ అన్నీ ఐటి ఇన్స్టి ట్యూట్స్ ఉంటాయి, మనం రిలీజ్ చేసిన ఏ ప్రొడక్ట్ , సాఫ్ట్ వేర్ అయినా వారంరోజుల్లో ఇక్కడ కోర్సు చెప్పడం మొదలుపెట్టేస్తారు సార్.. చెప్పాడు సెక్రటరీ.. ఓహో ఐతే మంచిదే కదా.. అంటూనే అక్కడ ఉన్న బ్యానర్ చూసి ఆశ్చర్యపోయాడు.. జావా రెండువేలకే.దానితో సీక్వెల్ సెర్వర్ ఫ్రీ… అని రాసిఉంది.. "హా..!! ఏంటి మన డాటాబేస్ ఫ్రీ నా…!", పోనీలే మన ప్రోడక్ట్ కి ప్రొమోషన్లా ఉంటుంది.. ", అని సరిపెట్టుకుంటుండగా… మైక్రోసాప్ట్ డాట్నెట్ 2.0 ఒక గంటలో.. పదిహేనేళ్ళ అనుభవం గల అప్పారావు చే… లిమిటెడ్ సీట్స్, త్వరపడండి.. ఫిజు.. 20 రూపాయలు మాత్రమే అని రాసున్న మరో బ్యానర్ చూసేసరికి బిల్ గేట్స్ కి కళ్ళుతిరిగినంత పనయ్యింది.. బాబోయ్.. ఏంటి గంటలో చెప్పేస్తారా?, ఇంజక్షన్ లాంటిది ఏమన్నా కనిపెట్టుంటారయ్యా ఈ హైదరాబాద్ వాళ్ళు.. వెళ్ళగానే సిరంజిలో డాట్నెట్ ఎక్కించేసి పొడిచేస్తారేమో… లేకపోతే ఒకగంటలో ఎలా చెప్తారంటావ్.. అయినా అతని అనుభవం చూడు పదిహేనేళ్ళంట.. డాట్నెట్ వచ్చి నాలుగేళ్ళు కూడా అయ్యిండదూ.. పదిహేనేళ్ళంటే అప్పటికి నేను కంప్యూటరు కూడా పట్టుండను.. హ హ అని నవ్వుకున్నాడు బిల్ గేట్స్. సరే సార్ ఒక్కసారి క్లాసుకెళదాం ఎలా చెప్తారో అని క్లాసుకెళ్ళి విని వచ్చారు.


సాయంత్రానికి అంతా తిరిగి తిరిగి ఒక హోటల్ రూమ్ కి చేరుకున్నారు. తరువాత రోజు ప్లాన్స్ ఏంటో అడిగాడు సెక్రటరీని బిల్ గేట్స్. రేపు మళ్ళీ బెంగుళూరు వెళ్ళాల్సిరావొచ్చు సార్. మన విండోస్ విస్టా అఫీషియల్ రిలీజ్ ఇన్ ఇండియా సార్ అన్నాడు.. ఉలిక్కిపడ్డ బిల్ గేట్స్ వద్దులేవయ్యా మళ్ళీ బెంగుళూరు ఎందుకులే ఎవరొకరు అది చేసేస్తారులే ముంబయి నగరాన్ని చూడాలనుంది సరదాగా అలా తిరిగొద్దాం ఇక ఇండియా టెక్నాలజీ చూసుకో అక్కర్లేదు ఎలాగూ ఇప్పటివరకూ చూసాం కదా అని అన్నాడు నవ్వుతూ. సరే అన్నాడు సెక్రటరీ.

తరువాత రోజు గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర్లో ఉన్న ప్రాంతాలన్నీ కాలినడకతో తిరుగుతున్నారు.

అలా వెళుతుండగా అక్కడ ఒక చోట సీడీలు అమ్మే దుకాణంలో ఒక సీడీని చూసిన బిల్ గేట్స్ కళ్ళుతిరిగి కిందపడ్డాడు.

అక్కడ ఏం చూసారు సార్ అని సెక్రటరీ చూడగా ఏ సీడీ అయినా ఏభై రూపాయలు అని ఉన్న చోట, విండోస్ విస్టా సీడీని చూసి కళ్ళుతేలేసి నోరు తెరిచాడు సెక్రటరీ.

------------------------------------------------------------

ఒక కల్పిత వ్యంగ్య రచన. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యముతో కాదు (కులదైవం బిల్ గేట్స్ ని అసలే కాదు)

15 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇవన్నీ అచ్చమైన నిజాలు :-) చాలా బాగుంది...:-)

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది

రాధిక చెప్పారు...

హ హ...నిజాలన్ని హాస్యన్ని జోడించి చాలా చక్కగా చెప్పారు.

వెంకట రమణ చెప్పారు...

బాగుంది మీ రచన.

cbrao చెప్పారు...

వాస్తవాన్ని రమ్యంగా చెప్పారు.

Unknown చెప్పారు...

చాలా బాగుందండీ మీ రచన.
బిల్ గేట్స్ ఈ సారి వస్తే ఇలాంటి స్వాగతమే ఉంటుందేమో

రానారె చెప్పారు...

A Tale Of Three Cities - సూపరు.

Sudhakar చెప్పారు...

"Padamati Godavari Ragam" is one of the best blog names i've ever seen.

Chala baga rasaaru. keep blogging :)

Rajendra చెప్పారు...

మీ కథ బహు బాగుంది. ముగింపులో కులదైవం పోలిక అదిరిందండి.

రాజేంద్ర ఆలపాటి

అజ్ఞాత చెప్పారు...

This is Real story.

అజ్ఞాత చెప్పారు...

ガーデンファニチャー
福島競馬場
アダルトショップ
まつげカール
探偵 調査
調査 会社
尾行 調査
高級クラブ求人
二人だけの結婚式
アダルトグッズ
表参道 エステ
英会話 学習
税理士 東京
電報
結婚式
まつげエクステ
カップリングパーティー
素行調査
興信所
興信所
高収入 アルバイト
高収入 アルバイト
競馬予想
電話占い
カップリングパーティー
結婚式 ウェルカムボード
株式情報

palli చెప్పారు...

The story of "Billgates visit" is an amzing contribution.I Really enjoyed reading the story.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఈ టపా ఫార్వార్డ్ మెయిల్స్ లో వచ్చిందండీ..ఎంత పాపులర్ అయ్యిందో మీ టపా కదూ!! కానీ ఫార్వార్డ్ చేసిన వాళ్ళు అది ఎక్కడ నుండి ఎత్తేసారో కనీసం ఇవ్వరు...ఇప్పుడే చూస్తున్నాను మీ బ్లాగులో ఇది..చాలా బాగా రాసారు.

పానీపూరి123 చెప్పారు...

మీ టపా బాగుంది, అయ్యో గేట్స్ చెన్నపట్నం లో బర్మా బజార్ కి రాకుండానే అమెరికా వెళ్ళిపోయాడా?

శ్రీనివాసరాజు చెప్పారు...

@శేఖర్ గారు
(మూడేళ్ళ మూన్నేళ్ళు)ఆలస్యంగా అయినా చదివినందుకు సంతోషం. అవునండీ ఇది మెయిల్ ఫార్వార్డ్ గా వచ్చింది.. విచిత్రం ఏమిటంటే.. ఎవరో గుంపులోగోవిందయ్య నాకూ పంపించారు. :)

సరేలే అందరూ చదవుతున్నప్పుడు నాపేరుంటే ఏమిటీ లేకపోతే ఏమిటని సరిపెట్టుకున్నానంతే..

@పానీపూరీ గారు
టపా నచ్చినందుకు సంతోషం. మీ స్పందనకు ధన్యవాదములు

అవునులేండి అదీ నిజమే.. పైరసీలో చెన్నపట్నం ఏం తీసిపోదు.

Related Posts Plugin for WordPress, Blogger...