నా గురించి

ఒక సాధాసీధా మనిషిని. పుట్టింది పెరిగింది పశ్చిమగోదావరి జిల్లాలో. చదువుకున్నదంతా అక్కడే.
ఉద్యోగరిత్యా ఒక బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీరుని. హైద్రాబాద్, ముంబయి, పూణే తిరిగి..
అప్పుడప్పుడూ మా పల్లేగాలులు పీలుస్తూ హాయిగా సరదాగా జీవితం గడిపేస్తుంటాను.

కధలు రాయటం నా ఆభిరుచి, అవి ఇలా ఈ బ్లాగుకెక్కించి జనాల బుర్రలు పాడుచేస్తుంటాను.

పాటలు వినటం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పాతపాటలు..
మంచి సాహిత్యవిలువలున్నవి పదే పదే విని ఇలాంటి పాట నా జీవితంలో ఒక్కటైనా
రాయాలి అనుకుంటుంటాను.

అదే ఆవేశంలో పాటలు రాస్తుంటాను.. అవింకా నాకే పరిమితమై చెవిలో
మ్రోగుతున్నాయనుకోండి అదివేరే విషయం.

నేనూ.. నా భార్య, అబ్బాయిలు కార్తికేయవర్మ, కౌశల్ వర్మ.., మా తల్లిదండ్రులు.., ఇదే నా కుటుంబం.
నేనెక్కడున్నా చుట్టూ నా హితులు.. స్నేహితులు ఇదే నా లోకం.

మీ
శ్రీనివాసరాజు ఇందుకూరి

మీ అభిప్రాయలను ఈ క్రింది ఎడ్రసుకు ఈ-మెయిల్ చెయ్యండి.


Related Posts Plugin for WordPress, Blogger...