18, జనవరి 2007, గురువారం

విలువ...



"సరేరా.. ఉంటాను.. బస్సు బయలుదేరేలా ఉంది.. అందరినీ అడిగినట్లు చెప్పరా.. పోన్ చేస్తాలే..," అని వెళుతున్న బస్సుతోపాటు వడివడిగా అడుగులు వేస్తూ స్నేహితుడిని సాగనంపాడు శంకర్. అతనికి సెలవు దొరకలేదు. ఎప్పుడు సెలవు అడిగినా ఆఫీసులో కొత్త వర్కు చెబుతుంటాడు వాళ్ళ మేనేజరు. తెలిసినవాళ్ళందరికీ సెలవులు దొరికాయి. ఇంటికి వెళ్ళిపోయారు. "రూమ్లో ఒంటరిగా ఉండాలిరా దేవుడా ఐదురోజులు. చచ్చాం", అని మనసులో అనుకున్నాడు. రాత్రి పదకొండు కావస్తుంది. ఏంటిరా బాబు ఇంత ఆకలిగా ఉంది. మధ్యాహ్నమే కదా కడుపునిండుగా తిన్నాం. మళ్ళీ ఆకలి మొదలు… ఇంకా ఇక్కడ ఏ టైముకైనా ఏది కావాలంటే అది దొరుకుతుంది కాబట్టి సాగుతుంది మనకు.. ఒకవారం తిండిదొరకని చోట ఉంటే తెలిసొస్తుంది.

సరే ఏదైనా హోటల్ లో బిరియానీ తిని ఇంటికి పోదాం అనుకుని రోడ్డుదాటాడు. హైదరాబాద్ హౌస్ బిరియానీ సెంటర్ కు చేరుకున్నాడు. రెస్టారెంటు కనిపించేంత దూరంనుండే గాలిలో కలిసి వస్తున్న బిరియానీ వాసనలను పట్టుకున్నాడు. ముక్కుకి అందిన బిరియానీ వాసనలతో కాస్త ఓపిక వచ్చినట్లుగా అడుగులు వేగంగా పడసాగాయి.

ఎల్లవొచ్చిగోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో…రింగ్ టోన్ తో జేబులో ఉన్నా ఫోన్ మ్రోగింది. ఈ టైములో ఎవరబ్బా అనుకుంటూ పోన్ తీసాడు. కిరణ్ గాడా.. వీడికేమయ్యింది ఈటైములో.. అనుకుంటూ అన్సర్ బటన్ నొక్కి.. "చెప్పరా.. ఏంటి.. ", అన్నాడు శంకర్. "ఒరే నేను ట్రైన్లో ఉన్నారా.. ఇంటికి బయలుదేరారా.. మావాడు లాస్ట్ మూమెంట్లో ఇచ్చాడు లీవ్… వాడిసంగతి తెలిసిందే కదా…నీకు చెబ్దామని చేసా. మళ్ళీ ఇంటికెళ్ళకా చేస్తారా బై", అని పెట్టేసాడు..


"హూ.. వీడికి కూడా లీవ్ దొరికేసింది. వీడి మేనేజర్ ప్రకాష్ రాజ్ కేరెక్టర్ లా కాస్త ఏడిపించినా, మంచివాడిలానే ఉన్నాడు". ఫోన్ తిరిగి జేబులో పెట్టుకుంటూ అలవాటు ప్రకారం ఫ్యాంటు వెనుకజేబుతడుముకున్నాడు. ఎత్తుగా ఉండే పర్సు లేకపోయేసరికి గుండెజల్లుమంది. కంగారుగా అన్నీ జేబులు వెతుక్కున్నాడు. ఫొను తప్ప జేబుల్లో ఏమీలేవు. నైట్ ప్యాంటు వేసుకోవడం వలన అన్నీ రూమ్లో పెట్టేసినట్లున్నాను అని తెలిసొచ్చిన తరువాత కాస్త మనసుకుదుటపడింది. కానీ రూమ్ తాళంచెవి కోసం వెతుక్కున్నాడు. ఎక్కడా దొరకలేదు. "ఓరిబాబోయ్…!!! ఈ వెంకట్ గాడు వేసినట్లున్నాడు తాళం, కూడా తాళంచెవి తీసుకెళ్ళిపోయాడు, నా తాళం రూమ్లో ఉండిపోయింది. ఇప్పుడెలా", అని గట్టిగా అరిచినంత పనిచేసాడు. ఒక్కసారిగా వీధిలైట్లు ఆరిపోయి చీకటైపోయినట్టుగా కళ్ళు బైర్లు కమ్మాయి.

"ఇప్పుడేంచేయ్యాలి…టైముకూడా పన్నెండు కావస్తుంది. ఎక్కడికెళ్ళగలం ఇంత అర్దరాత్రి, అయినా తెలిసినవాళ్ళంతా ఊరెళ్ళిపోయారే…ఎలారా..", అనుకుంటూ అలోచించసాగాడు.

బాస్కర్ గాడి రూమ్ దగ్గర్లోనే ఉంది కానీ వాడికి మనకు మొన్నగొడవయ్యింది.. ఇప్పుడు ఇలా వెళితే కాస్త కటింగులిస్తాడు.. వాడికాచాన్స్ ఇప్వకూడదు. ఇక డూప్లికేట్ కీ అయితే ఓనర్ దగ్గరుంది అక్కడివెళ్ళివచ్చేసరికి కనీసం అరగంట పడుతుంది.. అవును డబ్బులు కూడాలేనట్టున్నాయి అని వెతకగా.. ఒక ఏబైరూపాయలనోటు, అయిదురూపాయల చిల్లర పైజేబులో కనపడింది. హమ్మయ్యా.. ఇదన్నా ఉంది ప్రస్తుతానికి… ఓనర్ ని చేరుకున్నా అర్ధరాత్రి లేపడం మంచిదికాదు.

రేపువెళ్ళితీసుకోవాలి... అవును తాళాలు తీసేవడిని తీసుకొస్తే…ఇప్పుడు దొరుకుతాడా?, ఒకవేళదొరికినా, ఈ టైమ్ లో తాళాలు బద్దలగొడితే.. దొంగనుకునేరు ఎవరన్నా. సరేలే ఎదవగొడవంతా ఎందుకు.. ఈ రాత్రి ఎలాగోలా గడిపేస్తే సరిపోతుంది..

అసలంతా ఈ వెంకట్ గాడివల్లే… పదిన్నర బస్సుకోసం... పదింటివరకూ.. కదల్లేదు.., ఇక నన్నుకంగారు పెట్టి.. ఈ పరిస్ధితి తీసుకొచ్చాడు. వీడికి ఫోన్ చేసి నాలుగుతిట్లు పెట్టాలి… అని కోపంగా పోన్ తీసాడు.. డయల్ చేసిన నెంబరు కట్ చేసేసి.. ఎందుకులే.. మళ్ళీ ఈ జర్నిలో అంతా నిద్రలేకుండా అలోచిస్తాడు మనశ్సాంతిలేకుండా.. మనకెలాగు ఉండదు నిద్ర ఈరోజు ఇక వాడినిద్రపాడుచేయడందేనికిలే ఊరినుండి వచ్చాకా చెప్తా వాడిపని…ప్రస్తుతం ఏంచేయాలబ్బా అని ఆలోచించాడు.

బుర్రంతా నిండిన అలోచనలు కడుపులో ఆకలిని డామినేట్ చేసేసాయి. ఎదన్నా తినాలి అన్న ఆలోచన కూడా రావడంలేదు మనసులోకి. ఇక ఈ రాత్రికి రూమ్ ప్రక్కనున్న పార్క్ లో బెంచ్ పైన పడుకుని. రేపు పొద్దున్నే ఓనర్ దగ్గరకు వెళ్ళి తాళంచెవి తెచ్చుకుని ఆఫీసుకు వెళ్ళాలి.. అని నిర్ణయం తీసుకున్నాడు.

జేబులో ఉన్న డబ్బులతో బిరియానీ వచ్చేలా లేదు. అంతా ఖర్చుపెట్టేస్తే రేపు తిరగడానికి డబ్బులు అవసరం అని.. ప్రక్కనే ఉన్న సమోసా బండి దగ్గరకు వెళ్ళి పార్సల్ కట్టించుకున్నాడు.

వెన్నెల్లో చాలా అందంగా కనపడుతున్నాయి పూలమొక్కలు. పార్కులోకి అడుగుపెట్టగానే వచ్చిన పూలవాసనతో అతనికి మంచి ఆనందాన్నిచ్చింది. ఒక్కసారిగా టెన్నస్స్ అన్నీ మరచిపోయాడు. మంచి బెంచ్ ఒకటి చూసుకుని కూర్చున్నాడు. చందమామను చూస్తూ తిందామని సమోసా పొట్లం విప్పబోతూ అనిపించింది.

డబ్బులులేకపోతే.. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయ్… అదీకాకపోతే ఇంత పెద్దనగరంలో ఎంతో మంది స్నేహితులున్నారు.. అయినా ఈ గతిఏంటినాకు. ఖర్మకాకపోతే ఎంటిది?, నేను పర్సుమర్చిపోవడమేంటి?... వాడు తాళంచెవి మర్చిపోవడమేమిటి?, స్నేహితులంతా ఒకేసారి కట్టకట్టుకుని ఇళ్ళకుపోవడమేమిటి..?... బిరియానీ తినవలసినవాడిని, ఈ సమోసాలు తినడమేమిటీ.. అంతే మన టైం బాగాలేదు.. ఈరోజుకు ఏదోలా సర్దుకుందాం.. అని అనుకుని సమోసాల పొట్లంవిప్పాడు.

ఒక్కసారిగా చెడువాసన వచ్చింది.. చీ.. ఇదేంటి.. అని.. ముక్కుమూసుకున్నాడు కొంతసేపు. ఏంటి ఎక్కడిదీ చెడువాసన.. అబ్బా..!!, అనుకుని పొట్లం కాస్త దగ్గరగా పెట్టుకుని వాసన చూసాడు బాగానే ఉందే..? మరి ఎక్కడనుండి వస్తుంది అని లేచినిలబడి చుట్టూ చూసాడు. ఏదో కాగితాలు కదులుతున్న చప్పుడు కూడా వినపడింది. కొన్ని అడుగులు వేసాడు. చప్పడు వినపడ్డవైపుగా.

పార్కుకి పెన్సువేసిఉంది.. అదే ప్రక్కగా రోడ్డు, దగ్గర్లో వీధిదీపానికి కాస్త అటువైపుగా ఒక చెత్తకుండీ ఉంది. ఎవో కుక్కలు అనుకుంట అవి కదుపుతుండడం వల్ల చెడువాసన వస్తుంది అని తెలుసుకున్నాడు. వెనక్కుతిరిగివస్తుండగా అక్కడపాకుతున్నది కుక్కలా కాకుండా మనిషిలా అనిపించింది కాస్త మసక చీకటిలో, సరిగ్గా చూడగా ఎవరో మనిషి కనిపించాడు.

కొంపదీసి దొంగేమో.. అయినా దొంగ చెత్తకుండీదగ్గర ఏంచేస్తాడు. వీధి కుక్కలుకూడా కూడానే ఉన్నాయి. దొంగకాదు ఎవడో పిచ్చివాడుఅయ్యివుంటాడు.. దగ్గరగా చూద్దామనుకుని కాస్తముందుకు నడిచాడు... పెద్దశబ్ధంతో గూర్ఖావేసిన విజిల్ వినపడి ఉలిక్కిపడి చతికిలపడ్డాడు. అమ్మో ఈ చీకట్లో నేను దొరికినా దొంగనే అవుతాను. అసలే ఈ సిటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కువ.. అనుకుని కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు. భయంతో...

కొంత సమయం గడిచాకా లేచి చెత్తకుండీవైపు చూసాడు. ఒకతను మాసిన బట్టలతో, మట్టితో ఉండలు కట్టిన జుట్టుతో, గడ్డంతో, చెత్తకుండిలో కాగితాల మధ్య ఉన్న మెతుకులు వెతుకుతున్నాడు. ఏరిన పదార్దాలను చిన్న కాగితంపై పోగుచేస్తున్నాడు. ప్రక్కనే ఉన్న కుక్కలు అతన్నిదాటి వెళ్ళకుండా, ఆజ్ఞాపించినట్టుగా అక్కడే నిలబడి చూస్తున్నాయి. శంకర్ కి ఆశ్చర్యంవేసింది.. అదిచూసి ఒక విషయం అతనికి అర్ధమయ్యింది. అతనెన్నిరోజులుగా ఆకలిభాదను అనుభవిస్తున్నాడో.. పాపం. నా టెన్సన్ నా ఆకలిబాధను కొంత సమయం డామినేట్ చేసేసింది. అదే బాధ ఎక్కువైతే చుట్టూ ఉన్న చెత్తని, చెడువాసనని, రుచిని డామినేట్ చేస్తే ఏమవుతుందో అతని కళ్ళముందు ప్రత్యక్షమయ్యింది ఇప్పుడు.

అయినా అదే తినాలా?, అడుక్కుంటే ఎవరన్నాపెట్టకపోతారా?, ఏమోలే ఎద్దులా ఉన్నావ్ పనిచేసుకుని బ్రతకొచ్చుకదా? అన్న మాటలుకూడా విన్నాం.. చెప్పలేం.. పడ్డవానికే కదా తెలిసేది.. పాపం పిచ్చివాడేమో.. ఎమో తెలియక చేస్తున్నాడేమో.. ఎవరికైనా తప్పదు కదా ఈ ఆకలి బాధ. నా దగ్గరున్న సమోసాలు ఇచ్చేయడం మంచిది. ఒకరోజు నేను తినక పోతే నష్టంలేదు.. నాకు ఒక్కరోజు ఆకలిబాధఅంటే ఎంటో తెలుసొస్తుంది కూడాను. చిన్న ఈగో, దోమో పడింది అని గిన్నెడు అన్నాన్ని పడేసిన రోజులు ఉన్నాయి.. హోటల్లో తిన్నది ఎక్కువై, తీసుకెళడానికి నామోషీ వచ్చి వెయిటర్ కి చెప్పి తీసేయమని పడేసిన రోజులూ ఉన్నాయి..

నాలాంటివాడికి ఆకలిబాధ ఒక్కరోజు తెలియడమే మంచిదే.. సరే సరే.. ఇప్పుడు మన ఆలోచనలకన్నా అతని ఆకలి ముఖ్యం అతను అది తినకముందే ఇవ్వడం మేలు అనుకుని, పార్కు బయటకొచ్చి.. చెత్తకుండి దగ్గరకు చేరుకుని.. అతనిని పిలిచి సమోసాల పొట్లం చేతికిచ్చాడు శంకర్. అది తీసుకున్న ఆ వ్వక్తి. మళ్ళీ చెత్తకుండీ వైపు నడిచాడు.. ఏంటిది.. మళ్ళీ ఇటువైపు వెళుతున్నాడు అని పార్కులోకి వెళుతూనే అతని వంక చూసాడు శంకర్.. అక్కడ పోగుచేసిన పదార్ధాలను కుక్కలకు తినమన్నట్లుగా వాటి దగ్గరకు లాగి వీధిదీపం ఆవలికి వెళ్ళి కూర్చుని సమోసాలు తినసాగాడు. ఇదంతా చూస్తూనే శంకర్ తన బెంచ్ పైకి వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఆలోచనలు వెంటాడాయి.

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ||

ఇది చిన్నప్పుడు భగవద్గీతలో నేర్చుకున్న పద్యం

అవును ఈరోజే తెలిసింది పడేసిన ఆహారం కూడా ఇలా ఉపయోగపడుతుందన్నమాట.. కానీ మనంతినగా మిగిలింది, వేరొకరికి…మనుషులే తినలేనిది జంతువులకు, జంతువులు తినలేనిది క్రిమికీటకాలకూ చేరాలన్నమాట… ఏంటి ప్రతీరోజు ఇలాంటివి ఎన్నో చూస్తున్నా నాకు తెలియలేదు.. దానిగురించి ఆలోచించనూలేదు… ఈ రోజు నేను ఈ పరిస్ధితిలో ఉన్నా కాబట్టి ఆలోచిస్తున్నానా?,

ఏమోలే… ఎవరో చెప్పినట్లు …ఒక సంవత్సరకాలం విలువ తెలియాలి అంటే.. పరీక్షలలో తప్పిన విధ్యార్దిని అడుగు తెలుస్తుంది, ఒక నెల యొక్క విలువ తెలియాలి అంటే నెలలు నిండకుండానే జన్మనిచ్చిన తల్లిని అడుగు, ఒక నిముషం విలువ తెలియాలి అంటే తను వెళ్ళవలసిన రైలును దాటిపోతే తలపట్టుకున్న వ్వక్తిని అడుగు, ఒకసెకను కాలం విలువ తెలియాలి అంటే తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న వ్వక్తిని కనుక్కో, ఒక్క మిల్లీసెకను విలువతెలియాలి అంటే ఒలింపిక్స్లో రజతపతకాన్ని పొందిన వాడినడుగు…అని.

ఎదుటి వాడి ఆకలి బాధతెలియాలి అంటే ఒక్కరోజు ఆకలితో గడపాలి.., దూరమైనప్పుడే దేని విలువ అయినా తెలిసేది... అని అప్పుడే తెలుసుకున్నాడు.

ఇలా శంకర్ ఆలోచిస్తూ ఉండగానే తెల్లారిపోయింది.

13 కామెంట్‌లు:

తెలుగబ్బాయి చెప్పారు...

కథ బాగుందండీ.

అనిల్ చీమలమఱ్ఱి చెప్పారు...

ఆకలి గురించి చాలా బాగా చెప్పారు....

ఇది చదివిన తరువాత చాలా రోజుల క్రితం సి.వి. రావు గారు రాసిన ఒక కథ గుర్తుకు వచ్చింది..కానీ ఆ కథ ఆకలి గురించి కాదు...రేపు వీలైతే ఆ కథని బ్లాగిస్తా.

- అనిల్ చీమలమఱ్ఱి

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాసారు గురువుగారూ. (మరీ చనువు తీసుకుంటున్నానా?)

రాధిక చెప్పారు...

caalaa baagaa raasaaru.mii racanaa vdhaanam sunnitam gaa,saralam gaa vumtuunea loatugaa aaloacimpaceastumdi.

రానారె చెప్పారు...

చాలా బాగుంది. ఈ రచనకు ఇన్స్పిరేషన్ ఏమిటి?

spandana చెప్పారు...

ఎప్పటిలాగే అద్భుతంగా వుందీ కథ.
కాలవ విలువా ఆకలి విలువా చెప్పిన తీరు చాలా బాగుంది.
--ప్రసాద్
http://blog.charasala.com

అజ్ఞాత చెప్పారు...

బావుంది!

శ్రీనివాసరాజు చెప్పారు...

రామనాధ్ గారు:

"ఇన్స్పిరేషన్" అంటే ప్రత్యేకంగా ఏదీ ఉండదండీ..
కానీ పేపరుపై పెట్టేసరికి అలా వస్తుంది..
మీరు ఇచ్చిన పద్యానికి ధ్యాంక్స్ సార్.

ప్రసాదం గారు:

చనువు అయితే కాదు కానీ.. గురువుగారు అని వెటకారంగా కూడా అంటా కదా.. అది కాకపోతే మంచిదేనండి. :-)

రాధిక గారు: ధ్యాంక్సండి. ఎక్కువగా అలోచింపజేసేవి వ్రాయడమే అలవాటయిపోయింది.. నా శైలి అదే అయిపోయింది కూడా.. :-(

ఇక నా రెగ్యలర్ రీడర్ ప్రసాద్ గారు. మంచిది సార్.. నా 'విలువ' ను అర్ధం చేసుకున్నందుకు..

తెలుగబ్బాయి, చక్కనిచుక్క కు.. కూడా ధ్యాంక్సు చెప్పుకుంటున్నాను..


సార్.. ఇందులో ఎవరైనా నాకొక విషయంచెప్పగలరా.. నాకు రిప్లై ఇచ్చినవారికి తిరిగి రిప్లై ఇవ్వలేకపోతున్నా.. :-(, ఇలా ఇవ్వడం ఇష్టంలేక ఇవ్వడంలేదు ఇంతకాలంగా... లేకపోతే అందరికీ పేరుపేరున ఇద్దును ..

Hari Mallepally చెప్పారు...

Hey nice blog. meeru cheppedi nijamoo kathoo telidu kaani its really nice to see a telugu blog.

Unknown చెప్పారు...

Hi Rajugaru,
Blog (VILUVA) Excellent ga undandi. -Rama raju

Yoga చెప్పారు...

దరినున్న విలువా
దూరాననే చేరువా!

kadha baagundi...

Sudhakar చెప్పారు...

me writing lo manchi continuity vundi. nice flow of thoughts.

V.A.R Chowdary చెప్పారు...

Raju Garu,

U'r story is Excellent.

Related Posts Plugin for WordPress, Blogger...