1, జూన్ 2007, శుక్రవారం

నా రాత...

చాలా రోజుల తరువాత మళ్ళీ సమయం దొరికింది... మళ్ళీ వ్రాయడం మొదలుపెట్టాను.
వ్రాత నా జీవితంలో ఒక బాగంగా మారిపోయింది.. నా ఈ కలలు నిజాలు అవుతున్నందుకు.
నా రాతలు.. చదివి ఆనందిస్తున్నందుకు.... అందరూ నాకు ఇస్తున్న అభిప్రాయాలకు..చాలా ధ్యాంక్స్..

అవి.. ఇంకా నా మీద ఎన్నో కొత్త.. బాధ్యతలు వేస్తున్నాయి.. బాగా రాయాలి అనుకునేలా చేస్తున్నాయి..

ఈ మధ్య వ్రాయకపోవడం వలన ఏదో తెలియని వెలితిగా కూడా.. తోస్తుంది... నాకు.
అందరికీ పేరుపేరున సమాధానమివ్వాలని ఉంది..కానీ మీ మెయిలు ఎడ్రస్ నాదగ్గరలేదు..

అందుకే..

ఈ క్రింది విషయాల్లో ఏదైనా మీరు అనుకుని ఉంటే..


వీడేంట్రా.. రాస్తాడు.. అభిప్రాయం చెబితే సమాధానమివ్వడు..

ఎవో పిచ్చి రాతల్లే.. పని పాటా లేక..

రాసిందే రాసినట్టుంటుందెహే.. వేస్ట్.. చదవకు టైమ్ వేస్ట్..

కాస్త పెద్దగా రాస్తాడు కాని.. పర్లేదు. మేటర్ ఉంటుంది..

ఓ అదా నేను చదివాను.. బాగానే ఉంటుంది..

మనోడు.. కాఫీ దింపాడుర్రోయ్..

కాస్త ఎక్కువ చేస్తాడు కుర్రోడు..

వీడు కనిపిస్తే చెప్పాల్రా.. బాబు.. నీకో దణ్ణం ఇక రాయకు అని..లాంటి..వే కాక ఇంకా ఎమైనా మంచి/చెడు.. ఏదైనా సరే ఆహ్వానం..

నాకు మీ ఆభిప్రాయం చెప్పగలరు.. నిర్మొహమాటంగా.. !!!

సిగ్గులేకుండా.. భయంలేకుండా...

మరి ఇంకే.. కడిగిపడేయండి.. ఇక్కడ... srisri.indukuri@gmail.com

నాకూ.. ఓ మంచి స్నే'హితుడు'న్నాడని గర్వపడతాను...

త్వరగా కానీయండి మరి..


మీ
శ్రీనివాసరాజు ఇందుకూరి..

5 కామెంట్‌లు:

హరికిశొర్.కట్టా చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
హరికిశొర్.కట్టా చెప్పారు...

Mama,
Naa office life stroy neevu rayadam chala bagundi, thanks a lot. chalamandi mana lage alochistuntaru .

Unknown చెప్పారు...

హాయ్ శ్రీ,

నీ రాత బాగుంది. నీ రాతలోని చాలా విషయాలు నిత్యజీవితంలో జరిగేవే, వాటిని ఆ దృష్టితోచూస్తే బాగానే ఉంటాయి. మనలో చాలా మందికి చాలా ఆలోచనలు వస్తాయి, కాని ఎంత మందికి వాటిని ఇతరులతో పంచుకొనే తీరిక, నేర్పు ఉంటాయి. కాబట్టి నువ్వు చాలామందికాన్నా చాలా బెస్టు. కాకపోతే మీరు రాసిన "నేనుసైతం" వెనుక అసలు ఉద్దేశ్యం నాకు భోదపడలేదు.
ఇట్లు నీ స్నేహితుడు,
గడ్డము కృష్ణారెడ్డి (కాకినాడ)

Moyin చెప్పారు...

హలో శ్రీ గారు,

మీరు ఇది నమ్మాలి తప్పదు! వేరే దారి లేదు!!!. నేను ఒక వారం నుంచి తెలుగు బ్లాగులకి పరిచయం అయ్యాను. నేను మొట్తమొదట చదివింది మీ టాపు బ్రహ్మీ సాప్ట్వేర్ ఇంజనీర్..
అదే నా కొంప ముంచింది.ఆ రోజంతా మల్లీ ఆఫిసు లో ఒక టాస్క్ కూడ చేయలెదు.మొత్తం మీ టాపులన్ని చదివాను. చాల చమత్కారంగా, ఆకర్షనియంగా, ఆఫిసు పని చెయనీయకుండా ఉన్నాయి.

అజ్ఞాత చెప్పారు...

మీరు రాసే ప్రతీ పోస్టు చదువుతాను !!

కానీ కమెంట్ రాసేప్పుడు అనిపిస్తుంది , అరె ఇంత మంచి పోస్టు నేను కేవలం "baavundi " అని రాస్తే ఏం బాగుటుంది అనిపిస్తుంది ... వెంటనే డ్రాప్ అయి పోతా !! కానీ ఒక్కటి నిజం మీ ప్రతీ పోస్టు ... awesome , హిల్లారియస్ !! :)

Related Posts Plugin for WordPress, Blogger...