3, జులై 2007, మంగళవారం

చీమ కధ...అది.. సిటీకి దగ్గర్లో... రోడ్డుప్రక్కనున్న చెట్టుక్రింద ఒక చీమల రాజ్యం...


కాస్త లోతుగా పరిశీలించి...అక్కడ ఏం జరుగుతుందో... ఒక్కసారి చూద్దాం..


(కెమెరా.. జూమ్ మ్.... లైట్స్ ఆన్...;-) )


(కొన్ని చీమలు గూమిగూడి.. మాట్లాడుకుంటున్నాయి..)


ఒక చీమ: ఎరా.. మన చంటిగాడు కనిపించడంలేదేంటిరా...?


మరో చీమ: వాడికి ఎక్కువైందిరా.... ఈ మధ్య... ఎక్సట్రాలుచేస్తున్నాడు...


జీన్సులు టీషర్టులు వేసి.., పక్క చెట్టు.. ఆడచీమల వెంటపడి...

కటింగులిస్తున్నాడురా... ఎధవ..


మొన్న.. బంజారాహిల్స్.. చీమలన్నీ బైక్ పై వెళుతుంటే..

వెనక కూర్చున్న ఆమెని... కామెంట్ చేసాడంట..


అంతే.. అంతా.. కలిసి.. కుమ్మి వదిలారు... అయినా సిగ్గులేదు.. తరువాత మా

బ్యాచ్ తో చితక్కొట్టేసాను వాళ్ళని అని.. గొప్పులు చెప్పుకుంటున్నాడు తెలుసా?


ఒరే.. బంటిగాడ్రా బాబోయ్.. ఇలాగే వస్తున్నాడురా.. వీడొకడు.. సోదితో చంపేస్తాడు..

బుక్కైపోయాం.. ...


బంటి:( పల్సర్ బైక్.. సడెన్ బ్రేక్ కొట్టి ఆపి..)

హాయ్.. ఎలా ఉన్నారంతా.. నా డ్రస్ ఎలా ఉంది..రా..మిగతా చీమలు: బాగుందిరా..!!!, ఎక్కడకొన్నావ్.. రా..బంటి: చిరు అన్న గిఫ్ట్ బే.. తెలియదా??ఒక చీమ: (కొయ్ రా కొయ్.. వినేవాళ్ళం మేం ఉన్నాం కదా.. అని.. కళ్ళజోడు సర్దుకుంటూ)

చిరు అన్నా?? ఎవరు రా?మరో చీమ: (వెటకారం బయటకు కనపడనీయకుండా) ఏరా తెలియనట్టు అడుగుతావ్.. ,

మన బంటిగాడు పిచ్చ చిరంజీవి ఫ్యాన్స్ తెలుసా?


మొన్నే... చిరు అన్నతో ఫొటో తీయించుకున్నాడు... అప్పుడు గిఫ్ట్ ఇచ్చుంటాడు అన్న..

మనోడు బాగా క్లోజ్ రా.. అన్నకి..


ఒక చీమ: (ఆశ్చర్యంతో) ఓ.. నిజమా!! నాకు తెలియదురా..

ఒరే.. బంటీ నన్నూ తీసుకెళ్ళరా..చిరు అన్నదగ్గరకు వస్తాను.. ఫ్లీజ్.. రా..


బంటి: (స్టైల్ గా కాలు ఊపుతూ..) ఈ సారి చూస్తాలేరా.. అన్నకి ఖాలీ ఉన్నప్పుడు.. నాకు.. చెప్తాడు..

అప్పుడు తీసుకెళతా..లే.. పో..


ఒక చీమ: (పెంటమీద తిరిగే... గండు చీమ మొహం వీడూను.. వీడికి చిరు పోన్ చేసి చెప్తాడా??

కండచీమ కటింగులన్నీ ఉన్నాయ్ వీడికి..)


సరే.. రా.. మర్చిపోకూడదు.. మరి...


బంటి: మొన్న రావాల్సిందిరా... అన్న.. రక్తదాన శిబిరం దగ్గర నన్ను.. చూస్కోమని చెప్పిండని.. వెళ్ళాను..

నా రక్తం.. కూడా ఇచ్చాను.. తరువాత.. ఐబ్యాంకుకు.. నా కళ్ళు రాసిచ్చేసినా కూడా..

అందుకే.. ఈ షర్ట్ అన్న పేమతో.. గిఫ్టు ఇచ్చిండు..


ఒక చీమ: (ఏంటి.. నీ చీమరక్తమే..??, కళ్ళుకూడా..?? ఇచ్చావా..

ఇనేవోడుంటే.. ఎన్నైనా చెప్తావ్.. బురదలో పడిన.. కరెంటు చీమ మొహమూ నువ్వూను...)


ఓ.. మంచిపని చేసినావ్.. రా.., నాకు తెలిసుంటే నేనూ వద్దునురా..


బంటి: (కళ్ళజోడు.. తీసి తుడుచుకుంటూ..)

సరే నెక్స్ట్ టైమ్ బెటర్ లక్....


నేను పోవాలి.. జూబ్లీ హిల్స్ లో.. పవన్ ది.. షూటింగ్ ఉంది.. కలవాలి...

బై రా..


(బండిని దుమ్మురేగేలా..దూకించి.. వెళ్ళిపోయాడు.. బంటి)


మిగతా చీమలు: హమ్మయ్యా పోయాడ్రా బాబు.. చంపేస్తాడు.. సోది చెప్పి...


ఒక చీమ: ఒరే.. మన శేఖర్ గాడి బ్యాచ్ అంతా హైటెక్ సిటీ ఏరియాలో
సెటిల్ అయిపోయారంట కదా?


మరో చీమ: అవునురా.. వాళ్ళకేంటిరా.. మంచి.. తిండి దొరుకుతుందంట..!!.. పని తక్కువ ఉందంట!!..,

వారానికి ఐదురోజులేనంటరా!!... సాఫ్ట్వేర్.. కదా!! ఎంజాయ్ చేస్తున్నార్రా...


శేఖర్ గాడు.. టీసీయస్ ప్రక్కనే.. ఉంటుండంట.. సెల్ పోన్ కొన్నాడు..


అక్కడే.. విప్రో దగ్గర్లో ఉంటున్న గాళ్ళ్ ఫ్రండుని పట్టాడు..


ఇక ఎప్పుడూ ఫోనులో బిజీరా వాడు.., ఎంత ఉన్నా సరిపోవటంలేదురా ఖర్చులకి అంటున్నాడు..

వాడి స్టైలే మార్చేసిందిరా సాప్ట్వేర్...,


నేనెలాగూ వెళ్ళలేనురా.., అంత పెర్సంటేజ్ లేదు నాకు.. మా తమ్ముడిని తోసేద్దాం అని చుస్తున్నారా.. ఇప్పుడు


కొత్తగా రిఫరెన్సులు అడుగుతున్నారంట..ఫ్రెషర్స్ కి.., శేఖర్ గాడ్ని అడగాలి.. ఈ సారి ఫొన్ చేసినప్పుడు..


ఏవో కన్సల్టెన్నీలు ఉన్నాయంట కూడా అవికూడా తెలుసుకోవాలి...


ఈ సాప్ట్వేర్ వచ్చి.. మన చీమలరాజ్యాన్ని చెడగొట్టేసిందిరా.. ఎక్కడబడితే.. అక్కడ పుట్టలన్నీ ఫుల్..


పోనీలే మంచిది.. మనకు ఎక్కువ కష్టపడకుండా తిండి దొరుకుతుంది...


ఒకప్పుడు.. పప్పన్నం దొరికితే.. ఎంతగొప్పో.. దద్దోజనం, క్షీరాన్నం దొరికిన రోజు పండగే..


ఇప్పుడు.. హాట్ డాగ్.., పీజా.., చికెన్ బర్గర్... విత్ కోక్... లేందే.. తిన్నట్టుండడంలేదంట..

అలా అయిపోయార్రావాళ్ళు.. అందుకే.. ఎంత ఖర్చయినా మా తమ్ముడిని అక్కడికే


తోసేస్తారా..,


ఇక అప్పుచేసైనా మా చెల్లిని.. హై క్లాస్ వాడికే.. ఇచ్చి చేస్తా.., కనీసం.. నాలుగైదు.. గుంపుల్ని..


మెయిన్ టైన్ చేయగలిగేవాడై ఉండాలి..., నాలుగైదు.. చీమల దండులపై దండయాత్రచేసి ఉండాలి..


ఒక చీమ: నువ్వు అలానే కలలుకంటూ ఉండు.. అంత ఏక్టివ్ నెస్ పనికిరాదు.. ఈ కాలంలో.. అలా ఉన్నవాళ్ళ

జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలియటంలేదా??.. మనం చూడటంలేదా??


ఆ రామంగారబ్బాయి.. అలాగే.. ఉండేవాడు.. ఏమయ్యింది.. హాలీవుడ్.. వాడెవడోనంట..


మన చీమల జీవితం మీద ఏనిమేషన్ సినిమాకో.. దేనికోసమో రీసెర్చ్ అని వచ్చాడంట..


మనోడి టైం బాగోక.. వాడి కంట పడ్డాడు.. తీసుకుపోయాడు.., మనందరికీ దూరమై పోయాడు..


అలానే ఉంటుంది...

అందుకే.. చక్కగా.. చెప్పింది వినే.. లోకల్.. చీమకు కట్టిపడేయ్..,


మనం చెప్పినట్టు వింటాడు.. దొరికినకాడికి తింటాడు..


మరో చీమ: నేను అంత ఆశేం పడటంలేదుకానీ ఎదో చిన్న ఆశ.. చెల్లిని గొప్పోడికిచ్చి చేద్దామని అంతే...

మనిషిలా.. లక్షలు లక్షలు జీతమూరావాలి... పనీ ఉండకూడదూ...ఇన్కమ్ టాక్సూ ఉండకుండా.. డబ్బంతా మూటకట్టాలి అనో


పప్పూ... అవకాయన్నం కావాలి... డాలర్సూ కావాలి.. అనో... కోరుకునేంత ఆశకాదులే...సరే పదలే.. వీళ్ళతో ..మనకెందుకు... మన ఆశలు తీరేవికావుకానీ... మనిషిగా పుట్టినా...

మట్టిలో పురుగులా పుట్టినా... అనుభవించడానికి ... సుడుండాలి దేనికైనా...,

సరేలే.. మనింటి ఓనర్ భార్య టీ పెట్టే టైమైంది..పద.. ఈ రోజు పొద్దున్నే శుప్రభాతం మొదలుపెట్టింది వాళ్ళాయనపై..

పాపం ఏంచేసాడొ తప్పు.. ఆ కోపంలో మనకు పండగే ఈ రోజు..

నాలుగు పంచదారపలుకులు.. ఎక్కువ.. విదుల్చుతుంది.....


ఒక చీమ: అంతేలే.. మనకా పంచదార మీదే.. ఎక్కువ రాసాడు.. మనపేర్లు....

అవే..గతి మనకు... పద..

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

S/W professionals ni chima tho polchara ... too bad ...merru kuda s/w anu kunta

Related Posts Plugin for WordPress, Blogger...