2, ఆగస్టు 2007, గురువారం

అనువుగానిచోట... ఆవకాయన్నం..


 




గాంధీ తాత ఎందరికో ఆదర్శం.. ఇంకెదరికో... అభిమానం...
ఆయన సిధ్దాంతాలను

ఇప్పటికీ పాటించె మహానుభావులున్నారు..

పైకి చెప్పుకోకపోయినా చేసి చూపించకపోయినా..

అలానే.. తమకు తోచినవిధంగా.. పాటించేవాళ్ళున్నారు అంటే..

అది గాంధీ గొప్పతనం కాక ఇంకేంటి చెప్పండి?

నేను గాంధీకి అంత అభిమానిని కాకపోయినా...

ఆయన జీవిత చరిత్రను వడపోనసినవాడిని

కాకపోయినా.. ఆయన ఓర్పు.. గురించి చదివినపుడు,

స్నేహితులు చెప్పుకుంటున్నప్పుడు విన్నప్పుడు

కాస్త మనసులో ఆయన అంటే అభిమానం చేరుకుంది...

ఈ కాలంలో గాంధీ ఉండి వుంటే?? ఎలా ఉండేదో..

అని అనుకున్నా ఒకప్పుడు...

ఉండుంటే..ఆయన ఈ దేశాన్ని మార్చడంమాటేమో కానీ..

జనాలతో పడలేక ఆయనే మారిపోయేవాడేమో..

అవును.. నిజం... అలానే జరిగుండేది...

ఏ స్కాముల్లోనో..., మోసాల్లోనో ఇరికించేసేవారు...

నా పార్టీలోకిరా అంటే మా దాంట్లోకిరా అని..
చంపేసేవారేమో రాజకీయనాయకులు..

వాళ్ళ బాధపడలేక.. ఆయన ఏ కొత్తపార్టీనో
పెట్టుకోవాల్సి వచ్చేదెమో... కూడానూ..

గాంధీ చదివింది మా ఆనుభంధ సంస్ధల్లోనే.. అని కాలేజీవాళ్ళు..
డప్పువేసి బిజినెస్..

గాంధీవాడేది.. మా హెయిర్ ఆయిల్ అని.., మా సబ్బు..
అని.. వేరే కంపేనీలవాళ్ళు..

ఇక అవి తట్టుకోలేక.. ఆయనే.. ఒక కొత్త ఏడ్..లో నటించెవారేమో...

అదిగో గాంధీకి.. అక్రమార్జన ఎక్కువైంది.. అని నిలదీయివారొకరు..?

గాంధీకి నేను మొదటి భార్యను అని.. రుజువులు చూపించి.. కోర్టుకెక్కి..

రచ్చకీడ్చి... పాపులారిటీ కోట్టేవాళ్లూ.. అవి కధలుగా..
కధనాలుగా చూపించి బిజినెస్ చేసే వాళ్ళూ..

అమ్మో.. చాలా బిజినెస్ పోయింది పాపం గాంధీలాంటి..
మంచి వ్యక్తి మనకిపుడు లేకపోవడం వలన...

శంకర్ దాదా జిందాబాద్ సినిమాకి వెళ్ళాకా అనిపించింది..

ఆయన ఇప్పటి కాలంలో లేకపోవటమె ఎంతో.. మంచిదైంది అని...

సినిమా మొదలైన దగ్గరనుండి.. ప్రక్కనున్నవాడు ఏదో నసుగుతున్నాడు..

ఎంటో ఆ నసుగుడు అర్ధంకాలేదు..

కాస్త సమయం గడిచాకా.. అర్ధం అయ్యింది..

ఆ నసుగుడు కి కారణం పాపం.. గాంధీ అని...

అదేంటి.. గాంధీగారి తప్పేంటి అనుకుంటున్నారా?

చిరంజీవి.. ఎమోషన్ తెచ్చుకుని...
మంచి ఫైట్ చేసే టైంలో అయన రావటమే
అయన చేసిన తప్పు పాపం...

వచ్చాడ్రా..బాబూ... ఇంకెముంది.. చంపుతాడు..
క్లాసులు పీకి.... అని.. రానురాను.. నసుగుడు కాస్తా..
పెద్ద కేకలయ్యాయి.. పచ్చిభూతులు కూడా..

గాంధీ ఉండి ఉంటే.. హే రామ్.. అనేవారేమో.. వినలేక..

మరి చిరంజీవిలాంటి అగ్రహీరో ఏ ఉద్దేశ్యంతో ఆలాంటి సబ్జక్టును..
తీసాడో తెలియదు కానీ..

ఒక ఇమేజ్ చట్రంలో వాళ్ళను చూసే ప్రేక్షకుడు మాత్రం
ఆ ఉద్దేశ్యంతో తీసుకోలేదేమో అనిపిస్తుంది...

గాంధీ ఇప్పటి మనిషయితే... ఖచ్చితంగా..
జనాలు ఇంటిపై దాడిచేయటమో... రాళ్ళువిసరటమో చేసేవారు....

పెద్ద ప్రమాదం తప్పినట్లే అయితే!!!..

ఆయన ఇప్పుడు.. లేకపోవడమే మంచిదైంది... లేకపోతే..

గాంధీ సిధ్దాంతాలు పేరు చెప్పుకుని.. రాద్దాంతాలు.. చూడలేకపోయేవాళ్ళం...
భరించలేక మనమందరం గాడ్సేయవాదులయ్యేవాళ్ళం...

దీనికి మాతృక.. హిందీలో.. లగేరహో మున్నాభాయ్..
బాగానే.. పండింది.. నేను ముంబయిలో ఉన్నప్పుడు..
జనాలు కూడా బాగానే ఉంది అనుకున్నారు..

అవునులేండి.. సినిమాకి ముందు జనగనమన గీతం వేస్తే...
ఇప్పటికీ నిలబడి.. గౌరవాన్ని తెలిపే.. ప్రజ ఉన్న చోటు అది...
కాస్త కాకపోతే కాస్తయినా నచ్చుతుంది..

నచ్చకపోయినా గాంధీని తిట్టేంత ఉండదు అని చెప్పగలను...

ఏదైనా అంతే... అనువుగానీచోట... ఉంటే.....

రాక్.. పాప్.. మస్తుగున్న పబ్బులో

రఘుపతి రాఘవ రాజారాం పాట పెడతాను అంటే..

జానాలు కొడతానికొస్తారు...

ఆ మధ్య పౌర్ణమి అని ఒక సినిమా వచ్చింది....

చాలెంజింగ్ నిర్మాత ఎమ్మెస్ రాజు తీసిన సినిమా అది..

ఎయిటీస్.. స్టోరీలైన్ ని.. ఇప్పడు తీద్దాం అనుకోడం చాలేంజింగే...
కదా మరి..

కానీ ఇళయరాజా.. లాంటి.. గొప్ప సంగీత దర్శకులు ఉన్న ఆ కాలం...

జయప్రద.... భానుప్రియ లాంటి మంచి నాట్యం తెలిసిన వారు ఉన్న ఆ కాలం...

సంప్రదాయల్ని.. తెరకెక్కించి...అందరూ శెభాష్ అనేలా చేసే దర్శకులున్న ఆ కాలం...

ఇప్పుడు రావాలంటే.. ఎక్కడొస్తుంది....

సంగీతానికి దేవీశ్రీ న్యాయం చేసినా..

నాట్యానికి... ప్రభుదేవా.. న్యాయంచేసినా..

చార్మీలాంటి.. గ్లామరస్ అమ్మాయి.... చేత.. ఎన్నని..

వేయించగలరు స్టెప్స్?

ఒకవేళ.. ఎవరో భరతనాట్యం తెలిసిన అమ్మాయిని నూతన పరిచయం చేసి...

కధ నడిపిద్దాం అంటే.. కుదరదు.. జనాలకు నచ్చదని.. తెలుసు...

కానీ.. ఎదో.. కళకు. మన సహకారం చేస్తున్నాం అన్న తృష్ణ వాళ్ళను

ఇలాంటివాటికి.... పూనుకునెలా చేసినా...

ఇది.. కూడా.. అనువుకానిచోట... ఆవకాయన్నమే..


ఆఖరులో ఒకటి రాసారు ఆ సినిమాలో..

సంప్రదాయలను.. బ్రతికించండి.. అని..

అది చదివాకా అనిపించింది.. నిజమే.. బ్రతికించాలి.. అని...

ఈ కాలంలో.. సిద్ధాంతమైనా.. సంప్రదాయమైనా..
చెప్పినా చూపించినా.. అది..చచ్చినట్లే..

వాటిని బ్రతికించాలంటే... వాటిని.. అనువుగానిచోట..
ప్రదర్శించకపోవటమే మేలు...

పిజ్జా హట్ లో... ఆవకాయన్నం తింటే.. మరి..
అనువుగానిచోట ఆవకాయన్నమే.. కదా!!!

మార్పు అనేది.. జనాలలోనే రావాలి...
అది ఎప్పటికైనా వస్తుంది అని.. ఆశిద్దాం..

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గాంధీ గారి గూర్చి అంతా బాగానే చెప్పారు గాని, జయప్రదని నాటయంలో భానుప్రియతో జతకట్టటమే తట్టుకోలేకపోయాను.జయప్రద, నాట్యం నాకు తూర్పు పడమరలుగా అనిపిస్తాయి.

రానారె చెప్పారు...

గాంధీగారు అంత సులభంగా లొంగే ఘటం కాదండి. ఎంత మొండిఘటమైనా ఆయన ఓర్పుముందూ మొండితనం ముందూ తలవంచి తీరాల్సిందే. చిరంజీవి ఆవేశాన్ని అణచేస్తున్నాడని గాంధీమీద తిట్లులంకించుకున్న మానవుణ్ణి శాశ్వతంగా ఎలా లొంగదీయాలో ఎలా జ్ఞానోదయం చెయ్యాలో గాంధీగారికి చిటికెలో పని.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

మా పెద్దన్నయ్య అనేవాడు "గాంధీజీ - అంతటివాడు కావడం పూర్తిగా ఆయన గొప్పతనం కాదు. ఆయనలోని మహనీయత్వాన్ని గుర్తించి ఆయన నాయకత్వాన్ని అంగీకరించిన ఆనాటి ప్రజలదే ఆ గొప్పతనం." అని. మీరు రాసిన టపా ఆ అభిప్రాయాన్ని బలపరుస్తోంది.

ఎప్పుడైనా మన బుద్ధులకు తగ్గ నాయకులే మనకుంటారు. మనం పనికిమాలినవాళ్ళమై మన నాయకులు మాత్రం మణిపూసలు కావాలంటే కుదరదు.

Viswanadh. BK చెప్పారు...

భలేగా రాసేరు.

Venkata Phani.Vattikuti చెప్పారు...

baagundi.

అజ్ఞాత చెప్పారు...

I like play online game, I also buy mabinogi gold and mabinogi gold, the cheap mabinogi is very cheap, and use the mabinogi money can buy many things, I like mabinogi online gold, thanks, it is very good.

I like play online game, I also buy mesos and maple mesos, the cheap mesos is very cheap, and use the maplestory mesos can buy many things, I like maple story mesos, thanks, it is very good.

Related Posts Plugin for WordPress, Blogger...