15, మే 2010, శనివారం

హైకొచ్చిందోయ్ మావా...!!


"భలేమంచి రోజు.. పసందైన రోజు.. లచ్చిందేవి నవ్వే నేటిరోజు..", అని
స్టేటస్ మెసేజ్ పెట్టుకుని గూగుల్ టాక్ లో ఆన్లైన్లో కునుకుతుండగాసత్తిగాడు
"హాయ్', అని పంపించాడు మెసేజ్..


"ఒరేయ్.. సత్తిగా ఎలా వున్నావ్ రా..", అని రిప్లై ఇచ్చానేను.
"బాగానే వున్నారా!, ఏంట్రోయ్ లచ్చిందేవి అంటూ మాంచి హుషారుగా
వున్నావ్ ఏంటి కతా?, ఆన్ సైటు ఆఫర్ ఎమన్నాచేసాడా మీ మేనేజర్",
అన్నాడు.. సత్తి.


"హ హా.., అంతలేదులేరా.. ఈ రోజు నా సేలరీ రివ్యూ వుంది..
రేటింగ్ ఇచ్చి.. హైకు లెటరిస్తాడు మా మేనేజరు.. అందుకే రాత్రినుండి
నిద్రేలేదు ఎటుచూసినా లచ్చిందేవే కల్లోకొస్తుందిరా",అన్నానేను.


"నీ పనే బాగుందిరా.. సంవత్సరం నుండీ ఇదిగో.. అదిగో..
ఎం.డి దుబాయ్ సేట్లకు ఖర్జూరం అమ్ముతున్నాడు... అవి అమ్ముడవగానే
మీ అందరికీ ఎభైశాతం హైకు అని ఎదోవొక సోదిచెప్తా మా హెచ్చార్
ఊరిస్తుందిరా, అసలు మా ఎం.డి ఎప్పుడెప్పుడు ఇండియా వస్తాడా..
అని " వస్తాడు మా ఎం.డి. ఈ రోజు.. రానే వస్తాడు దుబాయ్ ఫ్లైట్లో
ఈ రోజు..., ఖర్చూరమమ్మిన డబ్బుతో.. మోయలేక సూట్కేసు మోస్తూ..
రానే వస్తాడు..", అని అల్లూరి సీతారామరాజు సినిమాలో కృష్ణ కోసం
ఎదురుచూస్తున్న విజయనిర్మలలా పాట పాడుకుంటూ.. మౌసు
చేత్తోపట్టుకుని, సీలింగ్ కి ఉన్న లైట్లో మా ఎం.డి ఫొటో ఇన్ సెట్లో
ఊహించుకుంటూ.. ఎదురుచూస్తున్నాంరా..", అన్నాడు సత్తిగాడు.


"హ హ. హా.., దుబాయ్ లో ఖర్జూరం అమ్మకమా.. అయితే మీకు
వందశాతం ఇస్తాడు హైకు.. నో డౌట్..", అంటూ నవ్వాను నేను..


"అవును నిజమేరా.. దుబాయ్ లో ఎవడుకొంటాడ్రా.., మరెందుకు
హెచ్చార్ అలా చెప్పింది... హమ్మనీ.. మోసంరోయ్..", అని సత్తిగాడు
ఆలోచనలోపడ్డాడు.


నాకు నవ్వాగలేదు.. గట్టిగా నవ్వేసాను..
పక్కసీటువాడు నావైపుతిరిగి
చూసాడు.. Alt+Tab కొట్టి నా వర్కు చేస్తున్న విండోని ఓపెన్ చేసి
ఏమీ తెలియనట్టు ఎలర్ట్ అయిపోయాను.


ఒన్-ఆన్-ఒన్ డిస్ససన్ ఇంకా ఐదునిముషాలువుంది అని ఔట్ లుక్లో
ఎలర్ట్ వచ్చింది.. ఓహో అయితే కాస్త బికారిమోహంపెట్టుకుని వెళ్ళాలి
అని రెస్ట్ రూమ్లోకి దూరి, నీట్ గా దువ్విన తలనంతా చెదరగొట్టేసి,
ఇన్షర్ట్ ని కాస్త అటూఇటూచేసుకుని మేనేజరుదగ్గరకు దిగాలుగా
బయలుదేరాను..


"హే.. హౌఆర్ యు?", అని పలకరించి.. "ఏంటి అలా వున్నావ్!,
ఏనీ ప్రాబ్లమ్..", అన్నాడు మేనేజర్

"ఏంలేదు.., వర్క్ కాస్తెక్కువుంది".. అన్నానేను

"సరే.. లెట్స్ స్టార్ట్ యువర్ ఎవాల్యుయేషన్", అని లేప్ట్ టాప్ లో ఎక్షెల్
షీట్ ఓపెన్ చేసాడు..., అలా ఒక అరగంట మా మధ్య మెగుడూపెళ్ళాలు
కొట్టుకుంటే బయట తలుపుదగ్గర కెమేరా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినట్టుగా
డిస్కషన్ అయ్యాకా. చిరాకు మోహం పెట్టుకుని నా డెస్క్ దగ్గరకొచ్చి కుర్చీలో
కూలబడ్డాను.


సత్తిగాడు చూస్తే అన్ లైన్లోలేడు.. సరే ఎవరున్నారా అనివెతుకుతుంటే
సునీల్ దొరికాడు..
"హాయ్..సునీల్!", అని విషయం అంతా చెప్పాను..
"కంగ్రాట్స్..", అన్నాడు.. స్మైలిలా నవ్వుతూ..

"ఏం కంగ్రాట్స్ నా బొంద.. పదమూడుశాతం తో సరిపెట్టాడు", అన్నాను.

"సరేలేండి ఆల్ రెడీ మీకు ఎక్కువేగా".. అన్నాడు సునీల్.
"ఏం ఎక్కువా.. తలపొగరా!! అన్నానేను..
"హి హి.. అదే..అదే.. కాదు.. సేలరీ" అన్నాడు సునీల్
నాలుక్కరుచుకున్న స్మైలీతో


"నేననుకున్న దానికన్నా రెండుశాతం తగ్గించేసాడు.. ఛా..", అని
ఏడుపుమెహం పెట్టాను.
"రెండు శాతమే కదా.., డోంట్ వర్రీ..", అన్నాడు సునీల్..
"రెండుశాతమేనా!!, అంటే ఎంతో తెలుసా.. అని క్యాల్కులేటర్ ఉపయోగించి..
లెక్కకట్టి.. నెలకు వెయ్యినూటపదహార్లు.., అంటే నా గ్రోసరీ ఖర్చుల్లో
సగం, ఇదే మా ఊర్లో ఎవడిపెళ్ళికి చదివించినా బాగానే పెట్టాడ్రా అనేవారు..,
ఎలా వదులుకుంటాం.. నేనొప్పుకోను..", అని సీరియస్గా మొహం పెట్టాను..


"హుమ్మ్.. అడిగి చూడండి, మీవాడిని.. అడక్కపోతే ఎవరు ఇవ్వరు..
అల్ ద బెస్ట్", అని ఏదో పనుంది మళ్ళా కలుస్తా అని లాగవుట్ అయ్యాడు సునీల్.


ఈలోగా సత్తిగాడు.. ఆన్ లైన్లోకొచ్చాడు.., "వా... అని ఏడుపుమొహంపెట్టి..
ఇన్నాళ్ళు చేసిన వర్కంతా పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటే.. అది చెయ్యిజారి
బురదగుంటలో పడ్డట్టయిపోయిందిరా నా బతుకు.. ఛీ.." అన్నానేను.


"సరేలే.. ఇంతకూ కాయా పండా". అన్నాడు.. సత్తిగాడు.
"టెంకరా.., నేనిక్కడ ఏడుస్తుందెదుకురా.. " అన్నా సీరియస్ గా..

"హ..హా..అనుకున్నా ఈ మేనేజర్లంతా టెంకలే చూపిస్తారు అని..
ఇంతకూ ఎంత", అన్నాడు సత్తి. మొత్తం విషయం చెప్పాను.

"ఎనకటికెవడో పెళ్ళిభోజనం పీకల్దాకా తిని.. ఇచ్చిన ఖిల్లీ వేసుకుంటూ,
అసలు ఈ ఖిల్లీకి పుల్లెవడు గుచ్చమన్నాడు అని నానా రభస రభసచేసాడంట
అలా వుందిరా నీ పనీ.. రెండుశాతమే కదా తగ్గించింది.", అని వెటకారంగా
అన్నాడు సత్తి.


"ఇక్కడ పనిచెయ్యలేని పంకజానికి ఇరవైశాతం.. దున్నపోతు బాబిగాడికి
ఇరవైశాతం..., నిద్రమోహం నీరజకు ఇరవైశాతం ఇచ్చి, నాకెందుకురా
పదమూడుశాతం.. నేనకుంది పదిహేనే కదా.. అదన్నా ఇవ్వొద్దా.. ",
అన్నానేను ఏడుస్తా..

"నువ్వేచెప్తున్నావుగా వాళ్ళుపనిచేయరని.. అందుకే అంత తక్కువిచ్చారు",
అన్నాడు సత్తి..

"ఒరేయ్.. ఇరవైశాతం అంటే నాకన్నా ఎక్కువరా.. నేనొకటంటే.. నువ్వొకటంటున్నావ్..
సరిగ్గా వినపడటంలేదా,చెవిలో మౌసుగానీ పెట్టుకున్నావా ", అన్నానేను..

లేదు హెడ్ఫోన్స్.. ఈ రోజు వర్క్ లేదు.. అందుకే పాటలువింటున్నా",
అన్నాడు సత్తి.

"ఓహో.. మీకంపెనీలో పాటలైనా వినొచ్చు కదూ.. మాకు ఆ
దౌర్భాగ్యంకూడా ఇవ్వలేదు.. ఛీ నా బతుకు చెడా... పైకి చూసి
ఉమ్మోసుకుంటున్నా", అన్నానేను..

"మొహంపై పడుంటుంది, తుడుచుకో.." అన్నాడు..సత్తి నవ్వుతూ..

"లేదులే పక్క క్యూబికల్ లోకి పోయింది.. అక్కడొకడు ఈ టైములో
నిద్రపోతూవుంటాడు.. ఏంపడినా పట్టించుకోడులే..", అన్నానేను
నాలుక్కరుచుకుంటూ..

"ఒరే.. నువ్వు రెండుశాతానికే ఏడుస్తున్నావ్.. నీ సేలరీ నా సేలరీ
చూసుకుంటే.. చాలా తేడా వుందిరా.. నేనెవడితో చెప్పుకోనూ..
నేనెవడిపై ఉమ్మేయను..", అన్నాడు సత్తి.

"అసలే ఐదున్నరేళ్ళు డెస్క్ కిందకు వచ్చేసాయిరా.. నాదే తక్కువుంది
అనుకుంటుంటే.. నన్నే అడుగుతున్నావా", అన్నానేను.

"ఏమోరా.. నెలక్రితం ఇద్దరుజాయనయ్యారు.. అంతే అన్ సైట్ పోయారు",
అన్నాడు సత్తి..

"మరదే.. చెవిలో మౌసులుపెట్టుక్కుర్చుంటే.. ఊరికే.. ఎవడిస్తాడు ఆన్ సైట్.. ,
వర్కుచెయ్యాలిబాబు", అన్నావెటకారంగా..

"అంతలేదులే.. ఆన్ సైట్ నాకిష్టంలేదులే, అక్కడ ఎక్స్ట్రా డబ్బులేమి ఇవ్వడంట..
దానికోసం ఊపించుకుంటా.. అంతదూరం.. ఇక్కడందర్నీవదిలేసి ఏం వెళతాంలే
అని వద్దనుకున్నా, మంచి ఆఫర్ వస్తే చూడాలి..", అన్నాడు సత్తి..

"యా. యా.. నేనుఅంతే.. మొన్న మావాడు ఆఫర్ చేసాడు.. మా ఆవిడ నన్ను
తీసుకెళ్ళకుండా మీరు వెళితే.. నేను హిమాలయాలకు వెళ్ళిపోతా అని బెదిరించింది..
సరేలే ఇద్దరూ వెళ్ళేవీలున్నప్పుడు వెళ్దాంలే అని ఆఫర్ ని ఎడంకాలితో ఒక్కతన్ను
తన్ని వద్దన్నా", అని చెప్పాను నేను..

సత్తి:(నాకే ఛాన్సూ రాలేదు.. కవరింగులు చేస్తున్నానని వీడు బాగానే కనిపెట్టేసాడు ..
అందుకే రివర్స్ కౌంటరేస్తున్నాడు)

"ఒరే.. నేనూ నీ బడిలోనే చదివానురోయ్.. ఒకే ఇండస్ట్రీ కూడా.., టైపుచేస్తే చెప్పేయగలను
ఏ కంపెనీ కీబోర్డ్ తో టైపుచేసావో.. నాతో పెట్టుకుంటే.. మడతడిపోద్దీ.. చెవిలో తుప్పంతా
కిందడిపోద్దీ.. హోయ్.. " అని టైపుచేసి.. నేను లంచ్ కి వెళ్ళొస్తా అని అన్నానేను..
నవ్వుతూ..


"సరేలేరా.. మళ్ళీ కలుద్దాం", అని నవ్వాడు సత్తి..

start + L బటన్స్ నొక్కి సిస్టమ్ లాక్ చేసి, వీడుకాదు మనబాధలు చెప్పుకోటానికి రైట్ పెర్సన్..
వేరేవాడ్నిపట్టుకోవాలి..అనుకుంటూ.. కేంటిన్ వైపు బయలుదేరాను నేను.

23 కామెంట్‌లు:

నేస్తం చెప్పారు...

మావారు pm లెండి ..(ప్రైం మినిష్టర్ అనుకునేరు)నిన్నంతా ఈ హైకులు ,రేటింగ్ ,పర్సెంటేజ్ ల గొడవే .. అబ్బా ..ఏం గోలే బాబు నాకు ..ఎక్కువ ఇవ్వకపోతే టీం వాళ్ళతో గొడవ ,ఎక్కువ ఇమ్మంటే పై వాళ్ళతో చీవాట్లు అని చెంచాడు అమృతాంజన్ రాసుకుని పడుకున్నారు :)

అజ్ఞాత చెప్పారు...

మా ఫ్రెండొకడు చెప్పేవాడు--పుట్టే పిల్లలు వాళ్ళ ఖర్చులు వాళ్ళే తెచ్చుకుని ఈ లోకంలోకి వస్తారుట! ఈ గొప్ప నీది కాదు. కార్తిక్ ది !! ఓకే ?

మంచు చెప్పారు...

@ శ్రీనుగారు: పార్టి ఎప్పుడూ.. ఎక్కడా.. సరేకానీ ..ఏటా 20 % హైకులిచ్చె కంపెనీ ఎదండిబాబు ..
@ నేస్తం గారు.. మీ ఇంట్లొ ఎప్పుడూ అమృతాంజం బాటిల్ వుండాల్సిందే కదా :-))

భావన చెప్పారు...

ఏ కంపెనీ అండోయ్ 20% హైకు లిచ్చే కంపెనీ ఇక్కడ 5 లేదా 6 % కే కొట్టుకుని చస్తుంటే. బాబ్బాబు చెప్పండీ మేము కూడా వస్తాము.
@నేస్తం: మీ ఆయన కు ఒక రికమండేషన్ వెయ్యమ్మా సింగ పూర్ వచ్చేస్తాము.

శివ చెరువు చెప్పారు...

హీ హి హి ...అలా అలిగితే ఎలా..సర్దుకు పోవాలి మరి.. మాది కూడా అదే స్టొరీ..మీరు చెప్పుకున్నారు. .. మేము చెప్పుకోవడం లేదంతే.. మహా బాగా రాసారు.. Nice ;)

శ్రీనివాసరాజు చెప్పారు...

@నేస్తం గారు
మీ వారిని..అదే పి.యమ్ గారిని బాగానే వెనకేసుకొస్తున్నారు.. :). మాకు (పి. యమ్ గారి కింద పనిచేసేవారికి) తక్కువిచ్చినందుకే ఆయన చెంచాడు అమృతాంజనం రాసుకుంటే.. ఆ తక్కువ తీసుకుని ఇంట్లో మా ఆవిడ పిల్లలూ పెట్టే నసకు మేమెంత అమృతాంజనం రాసుకోవాలో ఆలోచించారా?
మీ కామెంటుకు ధన్యవాదములు

@ఫణిబాబుగారు, మంచు-పల్లకీగారు, భావన గారు..
ఆఖరికి పంగనామాలు పెట్టినట్టున్న ఇమేజ్ పెట్టినా ఎవరూ నా బాధ అర్ధంచేసుకోలేందండీ.. :-(
నా రెండుశాతంరా నాయనో అంటుంటే నన్ను మీరు కూడా పట్టించుకోకుండా అభినందనలు తెలుపుతారా! :)

@భావనగారు, మంచుపల్లకీ గారు
ఇరవైశాతం ఇచ్చింది మా కంపెనీయేనండీ.. నాకు రెజ్యూమ్ పంపండి.. నేనే మొదటిరౌండు ఇంటర్వూ తీసుకుంటా.. మీకు ఈ స్కిల్స్ లేవు ఆ స్కిల్స్ లేవు అంటూ రేటింగ్స్ ఇస్తా.. తరువాత ఇలాచేసారేంటి అనకుండా ముందే చెప్తున్నా . మరే.. నాకు రెండుశాతం తగ్గించేస్తే.. ఒకరు కంగ్రాట్స్ అంటారా!, వేరొకరు సరిపెట్టుకోండి చాలు అంటారా!! :)

@శివ గారు
సర్దుకుపోయాంలేండి.. ఏం చేస్తాంమరి..!
మీ కామెంటుకు ధన్యవాదములు.. :)

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

By seeing that image itself, I got what you are trying to say. Nice post as usual.

P.S. It seems, your blog is not included in "Maalika". On behalf of you, I've sent a request to "Maalika" team.

శ్రీనివాసరాజు చెప్పారు...

@గణేష్ గారు
నా బ్లాగు నచ్చినందుకు సంతోషం.

మాలిక గురించి నాకు తెలియదండీ.. నా తరపున మీరు నా బ్లాగు అందులో చేర్చినందుకు ధన్యవాదములు.. :)

SATYA చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
SATYA చెప్పారు...

మంచి బ్లాగు బాగుంది .
నా పేరు ఉంది కదా అని నామీద అనుకునేరు .అనుకుంటే బ్లాగ్లో కాలు వేసినట్లే .

ధన్య వాదములు
సత్యనారాయణ

కొత్త పాళీ చెప్పారు...

good but not at your usual level of humor

sphurita mylavarapu చెప్పారు...

హి హి హి ...
నవ్వుతున్నావా అని కోప్పడకండి, నాదీ same story
హాయిగా కాంట్రాక్ట్లు (Building contracts కాదండోయ్) చేకుంటున్న నేను, rescission పుణ్యమా అని corporate consulting company లో తల దూర్చక తప్పలేదు. మొన్న మొదటి appraisal అయ్యాక ఏడుస్తుంటే friends అంతా ఓదార్చారు మొదటి సారి కదా అలానె వుంటుంది, పోను, పోను అలవాటైపోతుంది అనీ :D

శ్రీనివాసరాజు చెప్పారు...

@సత్య
మీరు భుజాలు తడుముకున్నప్పుడే జనాలకు అనుమానమొచ్చినట్లుంది.. అందులో కేరేక్టర్ మీరేనేమోనని.. :)

@కొత్తపాళీగారు
తప్పకుండా అదేలేవెల్ ట్రైచేస్తా ఈ సారి :)
మీ కామెంటుకు ధన్యవాదములు

@స్ఫురిత గారు
అవును అలానే ఏడవటం అలవాటయిపోతుంది.. :)
మీ కామెంటుకు ధన్యవాదములు

Unknown చెప్పారు...

శ్రీనివాసరాజు గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది...!!! :) :) :)

narration is simply superb

హరే కృష్ణ చెప్పారు...

very nicely written

"సరేలే.. ఇంతకూ కాయా పండా". అన్నాడు.. సత్తిగాడు.
"టెంకరా.., నేనిక్కడ ఏడుస్తుందెదుకురా.. " అన్నా సీరియస్ గా.

super చప్పట్లు


నేనూ నీ బడిలోనే చదివానురోయ్.. ఒకే ఇండస్ట్రీ కూడా.., టైపుచేస్తే చెప్పేయగలను
ఏ కంపెనీ కీబోర్డ్ తో టైపుచేసావో.. నాతో పెట్టుకుంటే.. మడతడిపోద్దీ.. చెవిలో తుప్పంతా
కిందడిపోద్దీ.. హోయ్.

ending అదిరింది

keep posting

శ్రీనివాసరాజు చెప్పారు...

@స్వేచ్ఛా, హరేకృష్ణ గారు

మీ కామెంటుకు ధన్యవాదములు.. ఈ ఫోస్టునచ్చినందుకు చాలా సంతోషం.., ఈ మధ్య ఖాలీదొరకక రాసినవి కూడా ఇంకా పోస్టుచెయ్యలేదు.. త్వరలోనే చేస్తాను :)

sivaprasad చెప్పారు...

"సరేలే.. ఇంతకూ కాయా పండా". అన్నాడు.. సత్తిగాడు.
inka nayam juice analedu
good post

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హ్హా..హ్హ..చాలా బాగా రాస్తున్నారండీ....ఇక్కడ మేము పది శాతం హైక్ కు కూడా నోచుకోక ఏడుస్తున్నాం..మీరేమో రెండు శాతం తగ్గిందని భాదపడతారా? అన్యాయం కదూ!! :-)

రాధిక(నాని ) చెప్పారు...

అయ్యబాబోయ్..........మరీ అలా నవ్విచ్చేత్తారేటండీబాబు.నవ్వీనవ్వీపొట్ట నొప్పొస్తుంది

శ్రీనివాసరాజు చెప్పారు...

@శివప్రసాద్ నిడమనూరి గారు
పోస్టు నచ్చినందుకు సంతోషం..
జ్యూస్ కూడా బాగానేవుంది.. :-)

@శేఖర్ పెద్దగోపు
తృప్తి అనేది లేని ఇండస్ర్టీ అండీ.. అలా అంటే ఎలా..
మేనేజర్ తిట్టినందుకు కాదు.. టెస్టర్ నవ్వినందుకు అనీ.. ఎంతిచ్చినా ఏడుపు తప్పదు.. :-)
నా టపాలు మీకు నచ్చుతున్నందుకు సంతోషం.

@రాధిక(నాని) గారు..
నవ్వండేపర్వాలేదు.. నవ్వుతో కాస్త రిలీఫ్ అవ్వండే... :-)
ధన్యవాదములు

..nagarjuna.. చెప్పారు...

చాలా రోజుల తరువాత విపరీతంగా నవ్వుకున్నా, మీ పోస్టు చూసిన తరువాత...

>>అవును నిజమేరా.. దుబాయ్ లో ఎవడుకొంటాడ్రా.., మరెందుకు
హెచ్చార్ అలా చెప్పింది... హమ్మనీ.. మోసంరోయ్..<<
>>"లేదులే పక్క క్యూబికల్ లోకి పోయింది.. అక్కడొకడు ఈ టైములో
నిద్రపోతూవుంటాడు.. ఏంపడినా పట్టించుకోడులే..", అన్నానేను
నాలుక్కరుచుకుంటూ..<<

హ హ హ్హ..

శ్రీనివాసరాజు చెప్పారు...

@నాగార్జున గారు
నా టపా మిమ్మల్ని విపరీతంగా.. నవ్వించినందుకు సంతోషం.

మీ నవ్వేచెబుతుంది.. మీరూ సాఫ్ట్వేర్ ఇంజనీరని.. :-)

Related Posts Plugin for WordPress, Blogger...