14, ఏప్రిల్ 2013, ఆదివారం

కాలక్షేపం


గూగుల్ లో ఎదో వెతుకుతుంటే.. ఓక లింకు ప్రత్యక్షమై  నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.. ఒక్క సారిగా అనువాద టీవీ సీరియల్ లో షాకింగ్ సన్నివేశం  లాగ మొహం బ్లాక్ అండ్ వైట్ లోకి మారిపోయింది.. ఇంతకూ ఆ లింక్ ఏమిటి అంటే.. నా పడమటి గోదావరి బ్లాగ్ లింక్.. మర్చిపోయి ఒక సంవత్సరం పైనే అవుతుంది.. మళ్ళి పురావస్తు తవ్వకాలలో బయటపడ్డ పురాతన వస్తువు లాగ.. నా గూగుల్ వెతుకులాటలో బయటపడి నన్ను భయ భ్రాంతుడిని చేసింది..

అయ్యో ఇదెలా మర్చిపోయాను ఇన్నాళ్ళు.. అని  గ్లిసరిన్ వాడకుండా కన్నీళ్ళు తెచుకున్న టీవీ నటిలాగా.. బోరుబోరున కన్నీళ్ళు కార్చాను.. ఆ కన్నీటి వరదలో నా కీ బోర్డు కొట్టుకుపోసాగింది.. ఇది కొట్టుకుపోతే అసలు రాయలేనే.. అని కన్నీళ్ళకు అడ్డుకట్ట వేసాను.

ఫుడ్డు..  బెడ్డు.. లేకుండా..  మూడు నెలలు జైలు శిక్ష అనుభవించిన ఖైది లాగ.. వారంతం.. ఏకాంతం.. లేకుండా..  అజ్ఞాతవాసం లో ఉన్న ఫేస్బుక్ యూసర్ లాగ.. చంద్రయాన్ యాత్రలో.. కాళ్ళ నొప్పులు కొని తెచుకున్న చంద్రబాబులాగా.. ప్రతి క్షణం ప్రపంచ వీక్షణం అన్నట్లు కంప్యూటర్ ముందు కునుకుపాట్లు పడుతూ పనిచేసి చేసి.. ఆఖరుకి కాస్త విరామం తీసుకుని.. ఏం చేద్దాం అని గూగుల్ లో హౌ టు అని కొట్టబోతే.. "హౌ టు కిస్ " అని చూపించింది..

చీ.. నా జీవితం.. ఇది ఎలా చెయ్యాలో కూడా గూగుల్ లోనే నేర్చుకోవాలా అని ఆలోచిస్తుండగా.. ఇంతకూ హౌ టు అని తరువాత నేను ఏమి  వెతకాలనుకున్నానో అసలు విషయం మర్చిపోయానని తెలిసింది.., నాకు "కిస్సాశ" చూపించి.. నా మైండ్ బ్లాక్ చేస్తావా అని..  గూగుల్ పై కోపంతో.. కీ బోర్డు పై మద్దెల దరువు వేసి.. ఏదేదో పిచ్చి పిచ్చిగా తెలుగులో బూతులు టైపు చేస్తే..  నా బ్లాగ్  లింక్ ప్రత్యక్షం అయ్యింది..

సరేలే గూగుల్ మంచి పని చేసింది.. నా బాధ్యత ని గుర్తుచేసింది.. అని క్షమించేసి.. ఇది రాయటం మొదలుపెట్టాను..
సగం వరకు రాసాను కాని.. ఇంకా మేటర్ లేదు..

విషయాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయ్.. కాని అవన్నీ విని విని చెవులు రోత పెడుతున్నాయి.. ఏదన్నా సరదాగా మాట్లాడుకుందాం అనుకుంటే ఏదొక రోత అందులోకి దూరి మరీ వస్తుంది..
సరే ఏమి తట్టనప్పుడు ఎవోటి మాట్లాడుకోవాలి కదా మరి.. !

కరెంట్ పొదుపుగా వాడుకోవాలి.. - సీ.యం
కిటికీ తలుపులు తీసుకుని.. తడిగుడ్డ వేసుకుని.. పడుకుంటే.. గాలి చక్కగా వేస్తుంది.., చల్లగా ఉంటుంది.. కరెంటు తో పనిలేదు.. - నేను

చేవేళ్ల చెల్లెమ్మ అమాయకురాలు.. - కొందరు నాయకులు..
ఆ అమాయకత్వం చేతుల్లోనే.. ఇన్నాళ్ళు రాష్ట్ర భద్రతను పెట్టిన ప్రజలే అమాయకులు - నేను.

ఇదే అసలు సిసలు ఐ.పి.యల్.. చాలా ఎంటర్టైన్మెంట్ .. అద్భుతః.. - ఒక ఫేస్బుక్ మిత్రుడు.
డబ్బులు ఖర్చుపెట్టి ఆటలు ఆడిస్తే.. అవును మరి.. అద్భుతః నే ,అది సినిమాలాగా ఎంటర్టైన్మెంట్  కాదా! - నేను

.. ఇవన్నీ రోత అన్నది అందుకే.. సరదా మాటల్లో కూడా ఈ రోత తప్పటం లేదు.
సరే టాపిక్ మార్చెయ్యాలి..

సమ్మర్ స్పెషల్ సినిమాలు దూసుకొస్తున్నాయి..
బాద్ షా సూపర్ హిట్ అంట కదా!.. - అవును సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం ఉండటం వల్లే..
అయినా శ్రీను వైట్ల సినిమా అంటేనే కామెడీ.. అందరికి తెలిసిందే కదా! - అవును.. గత కొన్నేళ్ళుగా అదే కామెడీ.. తిరిగేసి మరగేసి.. రంగు పూసి..

రామ్ చరణ్ తేజ్ సినిమా వస్తుంది చూడు.., కేక..! - ఆ సంబరం కూడా చూసేద్దాం..
ఏంటో ఈ జనరేషన్ లో పోలీస్ క్యారెక్టర్ కి ఎవరూ నప్పి నట్లు నాకు అనిపించటం లేదు..

అటు జూనియర్.. ఇటు రామ్ చరణ్.. మరి.. నాగ చైతన్య..?
కనీసం విలన్లని నాసిగా ఉన్న వాళ్ళను తీసుకుంటే.. పిడికిలి బిగించి కొడితే.. ఆమడ దూరం ఎగిరిపడ్డాడు అంటే.. నమ్మేట్లు అయినా  అనిపిస్తుంది..
ఏ మాటకు ఆ మాటే. ప్రిన్సు సూపర్.. పోలీస్ డ్రెస్ వేస్తే తిరుగులేదు..

నిన్నో మొన్నో.. టి.వి.లో వస్తే.. రెబెల్ సినిమా చూసాను.. ఆహ.. ఏమి సినిమా.. ఆస్కారుకు ఆస్కారం లేదా.. అద్భుతః.. వెంటనే లారెన్స్ కి ఫోన్ కొట్టి.. అన్నయ్యా.. గాడిద చేసే పని.. గుర్రం.. అని ఎదో సామెత ఉంది కదా!.. అది చెప్పాలని అనిపించింది.. ఏంటో ఈ సినిమాలు..

ఏదేమనుకున్న.. ఎవరేమనుకున్నా.. మా నాగ్.. కి తిరుగులేదు.. ఎప్పటికి గ్రీకు వీరుడే .
చిన్న సినిమాలు బాగుంటున్నాయి అనుకుందామా!.., ఎన్ని వస్తున్నాయో ఎన్ని వెళ్తున్నాయో అర్ధం కావటం లేదు..

మళ్ళి తేజ లాంటి దర్శకులు తెరపైకి వచ్చి.. సగం పండిన లవ్వు స్టోరీలు.. తెరపైకే తెచ్చి..  సినిమాలు తియ్యాలని నేను కోరుకుంటున్నా.

ఎదో సరదాకి లెండి.. ఏ టాపిక్ తీసుకున్నా ఇలానే ఉన్నట్లుంది..

అవును అన్నట్టు.. చెప్పటం మర్చేపోయా..
అందరికి శ్రీ  విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. అందరికి అన్నిటిలో విజయాలు చేకూరాలని కోరుకుంటూ... :-)

8 కామెంట్‌లు:

Mauli చెప్పారు...

@ఇంతకూ ఆ లింక్ ఏమిటి అంటే..

:)

జలతారు వెన్నెల చెప్పారు...

చాలా రోజులకు కనిపించారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు ఆలశ్యం గా.

Karthik చెప్పారు...

చాలా బావుంది...మీ టైటిల్ పడమటి గోదావరి రాగం నాకు బాగా నచ్చింది..

అజ్ఞాత చెప్పారు...

హమ్మయ్య!మీ బ్లాగు తిరిగి కనిపించినందుకు. నావి రెండు బ్లాగులు, చాలా గాప్ రావడంతో సమయం చాలడం లేదని విసుగొచ్హి నేనే డిలీట్ చేసాను. All the best.

అజ్ఞాత చెప్పారు...

Welcome back....
మీరు మళ్ళీ ప గో జి టపాలు వ్రాయాలి.
అన్నట్టు నా బ్లాగులో మీ బ్లాగు లింక్ ఉంటుందండి.

reguvardan చెప్పారు...

చాలా బావుంది...
News4andhra.com is a Telugu news portal and provides
Telugu Movie News, Latest and Breaking News on Political News and Telugu Movie Reviews at one place

online info చెప్పారు...

చాలా బావుంది...

Unknown చెప్పారు...

చాలా బావుంది...PLZ VISIT: www.indiaonlines.in

Related Posts Plugin for WordPress, Blogger...