20, మే 2007, ఆదివారం

నేను సైతం




ఎవరి విలువ వారిదే..! ఎవరి పాత్ర వారిదే.. కాదంటారా..!!

ఒక్కరోజు ఆఫీసుకు వెళ్ళకపోతే మనంలేమని ఆగిపోయే పనులుండవా? , అలాగే మనం ఆధారపడే ప్రతి విషయంలోకూడా అంతే కదా?, మేనేజరు రాకపోతే మనకేం చేయాలో తోచదు. అలానే మనం లేని సమయంలో మా మేనేజరుకి అంతే. ఈ ఆధారం పడటం అనేది లేకపోతే..!! ఎలా ఉండేదో..!,
అసలీ ఆధారం అనేది డబ్బుతో వస్తుంది అనుకుంటాను.. బ్రతకటానికి అవసరం కాబట్టి మనం పనిచేసి సంపాదిస్తాము. మనకు బోలేడంత డబ్బుఉంటే పనిచేయనక్కరలేకపోయేలా ఉంటే మనకి ఎవరిపైనైనా ఆధార పడే అవసరం ఉండదా..?

అదే చూద్దాం.. మనకో పెద్ద బంగ్లా.. కారు.. ఉన్నా అన్నీ అమర్చిపెట్టడానికి ఎవరొకరు కావాలి. సరే అన్నీ మనమే చేసుకుంటాం. అంటే కుదరదు..!, ఏదొకదానికి ఎదుటిమనిషి అధారం తప్పదు. అసలి రాజు-పేద కాన్సెప్ట్ ఎవడు కనిపెట్టాడో, ఎలా వచ్చిందో కానీ.. బాగానే ఉంది..!!, లేకపోతే డబ్బులున్నవాడు పేదవాడిని చిరాకు చూపులు చూసేవాడు.. ఆటో అవసరంలేదని కారులో వెళ్ళినా.. వంటమనిషి అక్కర్లేదు హోటల్ లో తిందాం అనుకున్నా ఇక్కడా అధారం ఉంది ఎంత డబ్బున్నా రైతులా తనకు కావలిసింది తను పండించుకోలేడు.. అలానే రైతు తను పండించుకున్నది తనే దాచుకుని తినలేడు. ఇలా డైరెక్టుగా ఆధారాలు విషయం వదిలేద్దాం. ఇక ఇన్ డైరెక్ట్ అలోచిద్దాం..

మనమొక అమెరికన్ కంపెనీకి పనిచేస్తున్నాము.. అనుకోండి.. ఇక్కడే ఉన్నా అక్కడుండే వాళ్ళు తెలియకుండానే మనమీద ఆధారపడుతున్నారు. మనం చేసిన తప్పులు భరిస్తారు.. చేసి అమర్చినవి హాయిగా అనుభవిస్తారు. వచ్చిన డబ్బుతో మనమూ అంతే.. ఇలా ఆధారపడేవి.. అధారాలుగా నిలిచినవాటితో సంభంధం ఉన్నవాటిలో..ఒక్క క్షణంలో మనం చేసిన తప్పైనా ఒప్పైనా ఆ ప్రభావం ఉంటుంది.


బైకు పై స్పీడుగా వెళుతున్నాను.. నా ఆఫీసుటైమవుతుందని.. ఎప్పుడూ వెళ్ళే రూటులో.. సడెన్ గా ట్రాఫిక్ జామ్ అయ్యింది సరే కదా అని.. అంతే స్పీడుగా నిర్ణయం తీసుకుని ప్రక్క సందులోకి తిప్పబోతుండగా అంతే స్పీడులో వస్తున్న బైకర్ సడెన్ బ్రేకు కొట్టి నా బైకుని గుద్ది పడ్డాడు.. కాసేపు.. కోపంగా చూసుకున్నాం.. నీదే.. అంటే కాదు.. నీదే తప్పు అని తిట్టుకున్నాం.. చివరికి దులుపుకుని ఎవరిదారిన వాళ్ళం వెళ్ళిపోయాం..

తరువాత పావుగంట ఆఫీసుకు లేటు.. సీట్లో కూర్చున్నాకా పావుగంటసేపు అదే అలోచనతో కొంతసేపు సమయం వృధా.. కాఫీ టైములో పక్క కోలీగ్ తో ఈ విషయం చెప్పి అదొక అరగంట సుత్తి.. ఇంతేనండి.. హైద్రాబాద్ అంతా ఛంఢాలంగా తయారైంది.. ఈ ట్రాఫీక్.. మరీ దరిద్రంగా ఉంది.. మొన్న నేను నెక్లస్ రోడ్డు లో వెళుతున్నానా… అంటూ మళ్ళీ వేరొక కధ.. ఇంకా ఎవరన్నా చేరి తమకి జరిగిన సంఘటనలు ఇలా విక్రమార్క కధ చెబితే.. మళ్ళీ ఓ అరగంట.. ఇలా ఇలా.. పని విషయంలో ఒక రెండు గంటలు వెనుకబడ్డాం.

ఆ ట్రాఫిక్ జామ్ గురించి ఆలోచించి ఒక్క నిముషం వేచుండుంటే ప్రక్క సందులోకెళ్ళే ఆలోచనుండేదీ కాదు.. వాడు నన్ను ఢీ కొట్టేవాడూ కాదు.. పడేవాళ్ళమూకాదు.. ఇలా కధలూ ఉండేవి కాదు.. ష్… అబ్బా.. ఎన్ని ఆధారాలున్నాయి.. ఈ చిన్న సంఘటనకు..

ఇక పడ్డవాడు.. వాడికి సంభంధం ఉన్నవాళ్ళలో కూడా ఎంత గడబిడ జరిగిందో.. ఇలాంటి విషయాల్లో కూడా ఆధారం ఉంది.. అది చెబుదామనే.. ఈ స్టోరీ అంతా..

ఫుట్ పాత్ పై కాకుండా రోడ్డుపై నడిస్తే.. మనవెనుక వచ్చే వ్యక్తి వెళ్ళాల్సిన ట్రైను దాటిపోవచ్చు.. రొటీన్ కి భిన్నంగా చేద్దాం అని.. సడెన్ గా సినిమాకి ప్రోగ్రామ్ పెట్టి సినిమాకి స్నేహితులతో కలిసి వెళితే.. గాళ్ ఫ్రండుతో ప్లాన్ చేసుకున్న వ్యక్తికి టికెట్ దొరక్క.. వాళ్ళమధ్య మసస్ఫర్దలొచ్చి అలకలురావొచ్చు.

ఈరోజు ఇంటికెళ్ళి వండే టైములేదండి.. ఇక్కడ తినేద్దాం అని హోటలుకెళ్ళిన ఒక జంట వలన.. ఆ హోటల్ పై ఆధారపడిన మిగిలింది తిని బ్రతికే ఒక ముసలతనికి ఆకలితో పడుకునేలా చేయొచ్చు. ఈ అనుకోని ఆధారాలు కూడా డేంజర్ లానే ఉన్నాయి కదా. అందుకే చేసే ప్రతిపని ఆచితూచి చెయ్యాలి..

అంటే మరీ ఆలోచించి పిచ్చివాళ్ళవ్వక్కర్లేదు కానీ.. కాస్త అలోచిస్తేచాలు.. మనకు తెలియని ఆధారాలు.. నష్టాలకు మన భాద్యతలేకపోయినా తెలిసి ఏదీ.. శచేయకుంటేచాలు.. నా ఇష్టం వచ్చినట్లుంటాను నీకేంటంటా.. అనుకునే చాన్సే రాకుండా ఉంటే చాలు.. ఆ.. ఎవడూ చూడటంలేదు కదా..పర్లేదులే.. అనుకోకుంటే చాలు....

మనం చాలా మందిపై ఆధారపడి ఉన్నవాళ్ళం.. అలానే మనపై కూడా ఎందరో ఆధారపడి ఉన్నారు.. ఒకరి చేయి పట్టుకుని ఒకరు తిరుగుతూ చేసుకున్న వలయం మనది.. మనం తప్పటడుగు వేస్తే మనవెనుకున్నవాడు.. అలానే వాడివెనుకున్నవాడు గీత తప్పి.. మొత్తం వలయమే గతి తప్పి మతిలేకుండా పోయే.. ప్రమాదముంది..


దేశానికి సేవ అంటే... ఆర్మీలో చేరి.. శత్రుదేశంతో పోరాడి వీరమరణం పొందినవాళ్ళు దేశసేవకే పుట్టారంటారు.. ఆ ఆదృష్టం అందరికి దక్కదనుకోండి.. అందరూ జవానులై దేశసేవ చేస్తానంటే..ఇక సేవలందుకునే జనమూ ఉండరూ..
ఒక డాక్టర్ రోగిని బ్రతికిస్తే.. ప్రాణాలిచ్చాడు.. దేవుడంతటివాడు..అంటారు..

అలానే ఇంజనీరు.. ఎందరికో నీళ్ళిచ్చి.. గృహాలు కట్టి.. సేవచేయగా.. అతనూ దేవుడే..

మరి నేనూ ఆ కేటగిరీలో లేను కాబట్టి మనిష్టం మనమీద ఆధారపడేవాళ్ళులేరు.. అని పనులుకానీయకండి.. అలా అని నేనెందుకూ పనికిరానని బాధాపడకండి..

మనకున్న పనిని సక్రమంగా నిర్వర్తించి.. ఎదుటివారికి ఇబ్బందిలేకుండా బ్రతకగలగడం కూడా గొప్ప దేశసేవేనండోయ్.. అది ఒక కళ కూడానూ.. ఎలా అంటారా.. అబ్బా ఇప్పటివరకూ చెప్పింది మీరు ఏమి విన్నట్లు.. మరి. అంతా మళ్ళీ చెప్పి.. మిమ్మల్మి ఇబ్బందిపెట్ట దలచలేదండి.. కాబట్టి..

ఈ లోకంలోకొచ్చినందుకు అనుక్షణాన్ని అనుభవిస్తూ.. ఆనందం పంచుతూ.. మనదైన శైలిలో ముందుకు సాగిపోదాం.. నేనుసైతం అంటూ..

సర్వే జనా సుఖినోభవన్తు…

6 కామెంట్‌లు:

సత్యసాయి కొవ్వలి Satyasai చెప్పారు...

చాలా మంచి విషయాన్ని చక్కగా చెప్పారు

Unknown చెప్పారు...

మీరు చెప్పిన విషయం చాలా బాగుంది కకపోతె తీసుకున్న ఉదాహరణలే కొద్దిగా out ofcontext అయినట్టూ అనిపించింది.
వేరే ఎవరో గర్ల్ ఫ్రెండ్ కీ వాడీకీ పొర పొచ్చాలొస్తాయని మనం సినిమాకెళ్ళడం మానేస్తామా ?
ఎవరికో తిండి దొరకదని మనం హోటల్ కెళ్ళడం మానేస్తామా ? మనం కాకపోతే వేరొకరు తినేవారేమో.
ఇది కొద్దిగా extreme thinking అనిపించింది.
కాకపోతే టపాలో అంతరార్థం నాకు నచ్చింది.

రాధిక చెప్పారు...

నిజమే .ఉదాహరణలు బాగోకపోయినా భావం మాత్రం అందరూ ఆచరించదగినది.

అజ్ఞాత చెప్పారు...

శ్రీనివాసరాజు నీ పోస్టు కోసం బ్లాగాభిమానులు ఇంత కాలం వేచి ఉండాలా? నా లాంటి అభిమానుల కోసం కనీసం రెండువారాలకు ఒక్కసారైనా బ్లాగుతూండు.
ఇక టపా విషయానికి వస్తే....ఎంతో లోతుగా ఆలోచించి వ్రాసినట్టు ఉన్నావు. మరి ఒకరిపై ఒక్కరు ఆధారపడబట్టే కదా దీన్ని "సంఘం" అన్నారు. ఈ రాజు - పేద డిజైన్ కన్నా పిల్లుల జాతి భిన్నంగా ఉంటుంది. అది రాజు - రాజు డిజైన్. ప్రతి ఒక్క పిల్లి తన పరిధికి రాజే. వేరే పిల్లులన్నీ పరాయివే. ఇందులో ఆధారపడటం లేదు.

వెంకట రమణ చెప్పారు...

బాగా వ్రాశారు.

chaitanya చెప్పారు...

బాగుంది శ్రీనివాస్ గారు...

Related Posts Plugin for WordPress, Blogger...