20, జనవరి 2009, మంగళవారం

ఏది "సత్యం"??భారత ఐటి రంగానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన సత్యం కంప్యూటర్స్
ప్రపంచానికి ఇచ్చిన షాక్.. నుండి ఇంకా తేరుకోలేకపోతున్నాం.

ఒకపక్క ఆర్ధికమాంద్యం వల్ల, అమెరికా ప్రాజెక్టులు.. క్లైంట్లు చేతులెత్తేయంటంతో...
పడిన దెబ్బకి కాస్త లేచి నిలబడగలిగే సమయంలో, ఈ సత్యం వార్త మరో దెబ్బలా తగిలి...
వీకెండ్ వస్తేనే గజగజ వణికిపోయే సాఫ్వ్టేర్ ఇంజనీరు.. ఇప్పుడు.. ఈ ఐటిపై పడ్డ దెబ్బమీద
దెబ్బకి..., ప్రతినోటా... వస్తున్న గాలి వార్తలకు వీక్ డేస్ లో కూడా వీకైపోవాల్సిన
పరిస్తితి వచ్చింది...

మన ఊరిలో కంప్యూటర్స్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా అందరికీ సులువుగా తెలిసే ఒకే ఒక్క కంపెనీగా
సత్యం కంపూటర్స్ కి ప్రత్యేక స్క్షానం ఉంది. సత్యంలో పనిచేస్తున్నా, అంటే ప్రజలు బ్రహ్మరధం
పట్టేవారు, వారికే పెద్దపీటవేసి... నలుగురిలో చెప్పుకునేవారు...,
పెళ్ళిసంభందాల విషయంలో కూడా.. అదొక ఆస్తిలానే లెక్కవేసేవారంటే...
మీరు నమ్మలేకపోవచ్చు...

నేను ఫలానా కంపెనీలో చేస్తున్నా అంటే... అది సత్యంకంటే పెద్దదేనా?
అని జనాలు అడిగేవారంటే.. దానిబట్టే చెప్పొచ్చు...
అది జనాల మనసుల్లో ఎంతలా నాటుకుపోయిందో...

మన ఆంధ్రావారిచేత స్థాపింపబడి అనతికాలంలోనే ఎదిగిన ఎకైక కంపెనీ కావటం వల్లనే ఇంత పేరు
రావటానికి కారణంకావొచ్చు...

మనం చేసే పని మనకు నచ్చినా నచ్చకపోయినా... ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగం, హోదాతో
సరిపెట్టుకుని రోజులు నెట్టుకొస్తున్నా.... ప్రతి ఒక్కరికీ ఒక డ్రీమ్ కంపెనీ,
డ్రీమ్ జాబ్ అంటూ ఉంటుంది... ఎప్పటికైనా ఆ కంపెనీ ట్యాగ్ మెడలోవేసుకోవాలి అనే
సంకల్పమూ ఉండొచ్చు..., అలానే చాలామంది మనసుల్లో డ్రీమ్ గా సత్యం కూడా ఉంది...,
నాకున్న ఉద్యోగ అనుభవంలో నేను స్వయంగా చూసి మెచ్చి నచ్చిన ప్రోసెస్ లు సత్యం కంపూటర్స్ లో
చూసాను... అప్పట్నుండీ నాకూ అది డ్రీమ్ కంపెనీగా మారింది...

కార్పొరేట్ కల్చర్ మనకు మనస్ఫూర్తిగా నచ్చకపోయినా!!,
మనకు అది తప్ప వేరే ఏదీ బ్రతుకుతెరువులేకపోతే అదే... గొప్ప కల్చర్ గా చెప్పుకుంటాం...,
ఇష్షంలేకున్నా కష్షమైనా అలవాటు చేసుకోవాళ్ళిందే కదా మరి!!!

మనం కంపెనీ మారటానికో... లేక జాబ్ సంపాదించటానికో పెట్టే రెజ్యూమ్ లో ఎంత
నిజాలుంటాయో మనకే తెలుసు... రెజ్యూమ్లో వ్రాసినవి నూరుశాతం కరెక్టేనా?
అని ప్రశ్నించుకుంటే ఎంతశాతం నిజాలుంటాయి?,
నిజంగా నిజాలు చేప్తే మనకు ఉద్యోగం వచ్చిఉండేదా?, నిజాలు చెప్పి ఎంతమంది మనలో
ఉద్యోగాలు సంపాదించి ఉండొచ్చు..??, లాంటి ప్రశ్నలువేసుకుంటే ఉద్యోగమే చెయ్యలేం...

క్లైంటుకు కంపెనీలు, ప్రాజెక్టులకోసం చూపించే లెక్కల్లో ఎంత నిజం ఉంటుంది?,
అలాగే మనం చేసిన పనిలోనూ.. చూపించేదాంట్లోనూ ఎంత నిజం ఉంటుంది...?
నిజంగా చెప్పాలంటే... కార్పొరేట్ అంటేనే మోసాలకు జన్మస్ధానం అని చెప్పొచ్చు.

అలాంటి కార్పొరేట్ కు వెన్నతో పెట్టిన విద్యే... లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించటం.

అదే పని రామలింగరాజు చేసినట్లు తోచినా..., ఇప్పుడు అదే పెద్ద స్కామ్ అని చిత్రిస్తున్నాయి
ఇప్పుడొస్తున్న కధనాలు..

మోసం చేసి డబ్బులు మళ్ళించటానికి... ఒక కంపెనీని.. 20 ఏళ్ళపాటు... పెంచి పోషించి,
వేలమందికి ఉద్యోగాలిచ్చి..., తెలుగువాడు గర్వపడే స్ధానంలో కంపెనీని నిలపాలా??

డబ్బాసే ఉంటే?, భైర్రాజు ఫౌండేషన్ ద్వారా.. వేలమందికి... పళ్ళెటూర్లలో ఐటి సర్వీసెస్ లో
పనిచేసే భాగ్యం కలిగించి...

మంచినీరే ఎరుగని ఊరికి..., ఏన్నో ఏళ్ళుగా సమస్యను చూస్తూ... ఎన్నో ప్రభుత్వాలు
మారినా... ఎవరూ చెయ్యలేని పనిని చేసి చూపించాల్సిన అవసరం ఉందా...?,
అలాగే ఆరోగ్యం, పారిశుధ్యంకు కోట్లు ఖర్చుపెట్టి... పనుల చేయించాలా?

ప్రాణాలవిలువ తెలుసుకుని..., అత్యవసర పరిస్ధితులకు తగినవిధంగా స్ఫందించే సాంకేతిక
పరిజ్ఞానంతో...,108 సేవలతో ఎన్నో ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉందంటారా??

చేసిన... చేస్తున్న పనులలో ఏదీ లాభాపేక్షతో చేసినవిగా నాకు అనిపించలేదు...
రాజకీయ అవసరాలు అసలే కనిపించలేదు... ఏనాడు మీడియాముందుకొచ్చి...
మేం ఇది చేస్తున్నాం అని చెప్పుకోలేదు...

ప్రతీ కార్పొరేట్ కి ఒక సేవా సంస్ధ రిజిష్టరై ఉంటుంది... అది కంపెనీకి వచ్చిన లాభాల్లో
ఇంత శాతం మేం సేవచేస్తున్నాం, అని చూపించుకోవటంకోసమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు...,
కానీ సత్యంకు భైర్రాజు ఫౌండేషన్ అలాంటిది కాదని... రాజు తన ఆశక్తితో నడుపుతున్నదని
తెలిసిన తరువాత వీళ్ళు చేస్తున్నది ఒక మహా కార్యం అని సదభిప్రాయం కలిగింది.

కనీసం ఎంతో కొంతశాతం చేసాం అని లెక్కలు చూపించుకోటానికైనా చేసిన కార్పొరేట్లైనా ఉన్నాయా?,
అంటే నాకు తెలిసి లేవనే చెప్పాలి!!

ఈ సేవలన్నీ చేస్తూ కూడా.. రాజు మోసం చేసారు అంటే నేను జీర్ణించుకోలేని విషయం.
ఇప్పుడు రాజు చేసినది పెద్ద ఫ్రాడ్ అని చెప్పుకునే వార్తల్లో ఎంత నిజముందో
ఆ దేవుడికే తెలియాలి మరి...

కానీ ఒక్కటి మాత్రం నిజం.. వ్యాపారంలో నష్టం-లాభం ఎవరూ తప్పించుకోలేనివి...,
అలానే మన కష్టమర్స్ అందరికీ న్యాయం చెయ్యాలి అంటే అదీ కాని పనే!!

నష్టాలొస్తే ఎవరొకరికి గట్టి దెబ్బ తగలక మానదు... కొన్ని విషయాలు ప్రాణంమీదకొస్తే కాని
తెలియవు మనం చేసింది తప్పే అని... ఆ సమయానికి అది.. ఒక వ్యూహం కావచ్చు...
పండితే దానికి ప్రశంసల వర్షం కురుస్తుంది..., పండకపోయి బెడిసికొట్టి అది బడామోసం
అయ్యే అవకాశమూ ఉంది...!!

ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియని రోజులివి. అందరిదీ స్వార్ధమే..., ఆ రాజకీయ పార్టీ
ఈ రాజకీయ పార్టీ ఒకరినొకరు తక్కువచేసుకుని మాట్లాడటమే కాని, అసలు నిజమేదో తెలిసుకునే
ప్రయత్నం చేస్తున్నట్లయితే కనిపించడంలేదు.
ఏమో ఈ ఆటలో అందరూ దొంగలేనేమో...అదీ చెప్పలేం.

మీడియా గురించి చెప్పనే అక్కర్లేదు.. ఏది జరిగినా ఆకాశం.. భూమి.. ఒక్కటై ప్రళయం వచ్చినా!!
పడిపోని బిజినెస్ ఏంటి అంటే... మీడియా అనిపిస్తుంది.. ఏది జరిగినా వాళ్ళకు బిజినెస్సే...

కులానికో ఛానల్.. పార్టీకో పత్రిక.. ఆహా.. ఏబాగుందీ బిజినెస్...!!!,
ఏది చూపించాలో ఏది చూపించకూడదో తెలియని.. మీడియాకు ఒక నియంత్రణ బోర్డ్లంటూ
ఉండవా??, ఉంటే అవి నిద్రపోతుంటాయా??.

ముంబై తాజ్ హోటల్లో జరిగే ఆపరేషన్లు టీవిలో చూస్తూ ఉగ్రవాదులు ఏం జరుగుతుందో
ఎలా తప్పించుకోవాలో ప్లాన్లుగీసుకున్నారంట..., అది చాలు ఉదాహరణగా చెప్పుకోవటానికి
మన మీడియా ఎంత అప్టుడేట్ గా ఉందో...

స్వతంత్ర్యం కావాలి కావాలి అని తెల్లవాళ్ళను... తరిమి తరిమి కొట్టి తెచ్చుకున్న మనం...
మళ్ళీ మా పైసాలకన్నా మీ యుకే పౌండ్లే భరువని నమ్మి బానిసల్లా వాళ్ళవెంట మనం
వెళ్ళేలా చేసిందీ ఈ కార్పోరేటే కదా!!!, అలా అని ఇంత చదువూ చదివి... బ్రతుకు బండి
నెట్టుకోలేని ఉద్యోగాలు చేస్తూ నేను గాంధేయవాదిని.. నా దేశపు నూలు వస్త్రాలే వేసుకుంటా,
నా దేశకోసం సేవలందించే ఉద్యోగమే చేస్తా అంటూ బ్రతకగలమా??

మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు శనివారం వస్తే..., మళ్ళీ ఆ రోజు ఆఫీసుకు సెలవని...
ఎవరూ రారని... ఆగష్టు 14నే జరిపిన పుణ్యం కార్పొరేట్ కల్చర్ కే దక్కింది...
అది చూసి నేను పాకిస్తాన్ లో ఉన్నానా? లేక భారదేశంలో ఉన్నానా అనిపించింది.
ఇదేనేమో గ్లోబలైజేషన్ అంటే..??, అని సరిపెట్టుకున్నా చివరికి...

తప్పదు... ఈ కార్పొరేట్ ప్రపంచంలో బ్రతికినంతకాలం మనఃస్సాక్షి చంపుకోవాల్సిందే,
వీటినుండి తప్పించుకోలేం.

పోటీ పోటీ అంటూ.. ప్రపంచంతోపాటు పరిగెడుతూ ఉన్నమనం...
నిలబడి నీళ్ళు ఎలాగూ తాగలేం అని నిర్ణయించుకుని...
పరుగెడుతూ పాలే త్రాగుతున్నాం...
పడిలేస్తూ ఇలా మనల్ని మోసంచేసుకుంటున్నాం.

ఈ సత్యం కధలో మోసం ఉండి తప్పించినా తప్పించొచ్చు...
మోసమేలేదు... అంతా కల్పితకధ అని చెప్పినా చెప్పొచ్చు...

ఈ కధ కంచికి ఎలా చేరినా... మనం ప్రేక్షకులలాగా చూడగలం తప్ప ఏమీ చేయలేం...!!

ఇప్పటివరకూ ఎన్ని జరగలేదు... మోసాలు? జరిగినవాటికి అన్నిటిననీ నిరూపించి..
బాధ్యులకు... శిక్షపడేలా చేసి... న్యాయమే జరిగిందంటారా??

ఈ విషయంలో నాకు తెలిసింది వ్రాసి వాక్ (బ్లాగ్) స్వాతంత్య్రాన్ని చాటి చెప్పటం తప్ప
నేను చేయగలిగేది ఏదీ తోచలేదు...

పై విషయాలలో నాకున్న జ్ఞాణంతో చెప్పిన, నా ఆభిప్రాయాలు మాత్రమే అని మనవి.

19 కామెంట్‌లు:

Bolloju Baba చెప్పారు...

నేనూ దాదాపు ఇవే వైరుధ్యాలతో ఆలోచిస్తున్నాను.

మీరన్నట్లు
ఈ కధ కంచికి ఎలా చేరినా... మనం ప్రేక్షకులలాగా చూడగలం తప్ప ఏమీ చేయలేం...!! అంతేనేమో.

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

నేను అలానే అనుకుంటున్నాను...
ఇలాంటి ఆలోచనలే ఇక్కడ
http://in.news.yahoo.com/241/20090120/1272/top-column-ten-truths-from-satyam.html

Rajesh చెప్పారు...

Gud one Raju.., Single mistake will over come..Lakhs of gud things..,

So.., Though we are not happy for things happening for SATYAM RAJU we can't do any thing. But one things true, He is the guy who has given life to 53 K families directly and many more families indirectly..,

లక్ష్మి చెప్పారు...

చాలా రోజుల తర్వాత రాసినా చాలా బాగా చెప్పారు. నిజమే కార్పొరేట్ ప్రపంచంలో అందరికీ తలో ముసుగూ ఉంది, అది బయటపడనంత కాలం అందరూ దొరలే, బయటపడితే అందరూ దొంగలే. మీరన్నట్టు ఏమి జరిగినా ప్రేక్షక పాత్ర వహించి చూస్తూండగలము తప్పించి ఏమీ చేయలేము. అంతే.

సుజాత వేల్పూరి చెప్పారు...

కొంచెం రిలీఫ్ గా ఉంది మీ టపా చదువుతుంటే!
"లేనిది ఉన్నట్టు చూపించడం" అనేది కార్పొరేట్ సంస్థల్లో సర్వ సామాన్యం అని తెలిసి కూడా ఇంత గొడవ ఎందుకు జరుగుతోంది?

"మోసం చేసి డబ్బు మళ్ళించడానికి ఒక కంపెనీని పెంచి 20 ఏళ్ళపాటు పొషించి, వేలమందికి ఉద్యోగాలిచ్చి,తెలుగువాడు గర్వపడే స్థాయిలో నిలపాలా?" నాదీ ఇదే అంతర్మధనం!

బైర్రాజు ఫౌడేషన్ చేసిన సేవలను స్వయంగా పశ్చిమ గోదావరి అంతా చూశాను. అందుకే ఆయన మీద అందరితో పాటు వెంటనే రాళ్ళు విసరలేకపోయాను. ఆయనకున్న ఇమేజ్ మీద ప్రేమతో కాదు.

మరి ఏది సత్యం? ఈ మోసంలో భాగస్వాములెవరు? అసలు ఆ ఏడువేల కోట్లకు అసలు ఉనికే లేనట్టా, ఈనాడు రాస్తున్నట్టు భూములు కొనడానికి వాడినట్లా? (కొందరైతే 108 మీద కూడా రాళ్ళు విసరడానికి సిద్ధమయ్యారు.)

రాజు ఎవర్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు? లేక నిజంగానే ఏ మోసంలో ఆయన పాత్ర ఉందా? ఇవన్నీ ఎప్పటికి తేల్తాయో? సైబర్ టవర్స్ రోడ్ లో ఆయనకు మద్దతుగా వెలసిన పోస్టర్లు చూస్తుంటే తెలియని ఆవేదన కలిగింది.

నిజంగానే ఆయన ద్రోహానికి పాల్పడ్డారని తేలితే.....సత్యమనే మాటకు అర్థం లేనట్టే!

శ్రీ హర్ష PVSS Sri Harsha చెప్పారు...

మొన్న ప్రపంచ బ్యాంకు విప్రోని కూడా బాన్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇవాళ rediff లో వచ్చిన వ్యాసం కూడా బావుంది. అది కూడా మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని బలపరుస్తోంది.

Shiva Bandaru చెప్పారు...

i agree with you

krishna rao jallipalli చెప్పారు...

ఈ విషయంలో నాకు తెలిసింది వ్రాసి వాక్ (బ్లాగ్) స్వాతంత్య్రాన్ని చాటి చెప్పటం తప్ప
నేను చేయగలిగేది ఏదీ తోచలేదు... మీరు చెప్పే బ్లాగ్ స్వతంత్రంతో రాస్తున్నాను. ఒక రోడ్ కాని ఒక బ్రిడ్జి కాని నాసిరకంగా కడితే చాలా ప్రజా దనం వృదా అవ్వడమే కాకుండా ఎంతో మందికి అవి ప్రమాదకారులుగా మారవచ్చు. ఒక బాంకు గాని, ఒక ఆర్తిక సంస్త దివాలా దీస్తే ఎంతోమంది సామాన్యులు జీవితాలు బజారున పడతాయి. (KRISHI, CHARIMANAR, GLOBAL TRUST, NAGAARJUNA ETC) కొండకచో ఆత్మా హత్యలకి దారి తీయ వొచ్చు. ఇక సత్యం రామలింగ రాజు గారు చేసింది తప్పే. ఎంతో మంది investors రోడ్డున పడ్డారు. ఎంతో మంది ఉద్యోగుల బవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. INVESTORS డబ్బులు తిరిగి రావడం కల్ల. అలాగే ఉద్యోగులకి ఏదో ఒక ఉద్యోగం రావచ్చు కాని .... ప్రపంచంలో బారత IT కంపనిల పై చెడు అబిప్రాయం ఇంకా బలంగా మారింది. పరువు బజార్న పడింది. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్థం కాని పరిస్తితి నెలకొంది. కాదనలేము. కాని ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్న పెద్దలు గతంలో జరిగిన వాటికి ఎందుకు స్పందించ లేదు?? స్కాముల్లో ఉన్నవారు వారి నోట్ల కట్టలతో ఈ పెద్ద మనుషుల నోర్లు నొక్కేసారా?? RAAMALINGA RAAJU గారు కొంతమంది పెద్దలని మేపడంలో విఫలం అయ్యారా??

అజ్ఞాత చెప్పారు...

మీరు ఇంత ఆలస్యంగా స్పందించడం బాలేదు."అనువుగానిచోట అధికులమనరాదు" అని నోరు నొక్కుకు వూరుకున్నా.ఈనాడులో కస్టడీలో రాజుగారి కస్టాలు(వాడి ఇస్టంగా) వర్ణించి రాస్తుంటే గుండె తరుక్కుపోతుంది
నిజం నిలకడమీద తేలుతుంది .అందాకా ఆగేదెవరు .చేతిలో రాయుంది విసిరేస్తే ఓ పనైపోతుంది అనుకునేవారేకాని

సుజాత వేల్పూరి చెప్పారు...

లలిత గారు,
అనువు గాని చోట అధికులమనరాదు..అని మన మనసులో భావాలను స్వేఛ్చగా వ్యక్తీకరించకపొతే ఇక బ్లాగుకి అర్థమేముంది.మన అభిప్రాయాలు మనం చెప్పాలంతే! నేనైతే రాజు కి నా నైతిక మద్దతు ప్రకటిస్తున్నాను. ఆయన నిజంగా నేరం చేసారని తేలితే మాత్రం అప్పుడు దించుకుంటాను తల...రోశయ్య లాగా తొందరపడను.

శ్రీనివాసరాజు చెప్పారు...

@లలితగారు
-------------------
లేటుగా స్ఫందించడంకాదు..!, జరిగినది జీర్ణించుకోటానికి
కాస్త టైము పట్టింది అంతే..

@కృష్ణారావుగారు
-------------------
మీరు ఇచ్చిన కామెంట్ కి నేను ఒక్కటే చెప్పగలను...

శ్రీహర్షగారు ఇచ్చిన లింక్ లోని ఆర్టికల్ సారాంశమే మన ప్రస్తుత కార్పొరేట్లు తమ ఉనికిని చాటుకోవటం కోసం చేస్తున్నవి.. చేసిన తప్పును బహిరంగంగా అంగీకరించడమే ఈ కాలంలో తప్పు . లోకం మొత్తం ఇలా చేస్తారు, ఇది మామూలేగా... అని అనుకునేంత వరకూ నీ తప్పు దాచిపెట్టు... తరువాత కూడా నీ తప్పు బయటపెట్టొద్దు... అని ఆ ఆర్టికల్ సారాశం

The only unfortunate moral of the story is that do what you have to do but don't get caught. And if you do, then leap up in righteous indignation! Or better still, find the right definition or phrase for what you are doing. And, like speed money,("A bribe is payment to a government officer for doing something he should not do and speed money is payment for doing something he should.") wait till that phrase gets institutionalised. And till then, whatever else happens, just don't confess.

వేచి చూద్దాం.. ఏం జరుగుతుందో...

Mythreyi చెప్పారు...

Hi Srinu, Very Good Analysis... నేను ఇలాగే ఆలోచిస్తున్నాను.రాజు గారికి అసలు మోసం చేయాలి అంటే ఇన్ని రోజూలు ఆగాలా? ఈ రోజూ ప్రతి ఒక్కరు రాజు గారిని comment చేస్తూన్నారు.అది చూస్తు ఉంటే అప్పుడు అనిపిస్తుంది లోకం అంటే ఇలా వుంటుందా అని? అందరు comment చేసే వారే కాని ఒక company ని ఆ stageకి తీసుకువచ్చి ఇప్పుడు ఇలా జరుగుతూ వుంటే No one can think from his side. Its Soo Sad. Today's Politicians bank A/C ఎంత వుంటుంది?I think Raju garu didn't take a single NP for his self.నేను మాత్రం రాజు గారి కి 100% support చేస్తాను. రాజు గారు mistake చేసారు అంటే definite గా some one is there behind the screen.నేను కోరుకోనేది ఒకటే.....Please be patience and don't leave comments till the truth knows.Atleast give respect to his Hardwork & Charity.

అజ్ఞాత చెప్పారు...

సుజాత గారూ మీ మద్దతుకి ధన్యవాదాలు. కొన్ని బ్లాగుల్లో చర్చలు, చదివాకా నోరు మూసుకోవటమే ఉత్తమం అని అనిపించింది .నరహంతకులకు కూడా రాచమర్యాదలు జరుగుతున్న రోజుల్లో, ఎలా పుట్టి ఎలా బ్రతికి ఈరోజు ఇలా దోషిగా ................తలుచుకోటానికే బాధగా వుంది . ఆయనమీద వ్యంగ్యంగా వచ్చిన గేంస్,s.ms. లు సైట్లు ,లాంటి వాటి వివరాలు ఎంతో స్రద్దగా రాస్తున్న ఈనాడు పేపర్ను చూస్తుంటే కసిగా చించి అవతల పారేయాలనిపిస్తుంది . నీటినుండి నేలమీదిక్కొస్తే అంతబలంకల మొసలికూడా వూరకుక్కకి లోకువ అంటారు ఇదేనేమో

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

mmm ఎంటి ఇంకా ఇంత చేస్తారు...మొత్తం అమెరికా technology use చేసుకుంటు ..దానినే తిట్టె అందరు..ఇంత ఫ్రౌద్ చెసిన still
.......100 ని 150 అంటె పర్లెదు.....మరీ 5000 గా చుపిస్తే అమ్మ్మొ....తను తెలుగు వాడ కాద అని వదిలి మొదట దోషా కాద అని చూడండి. తెలుగు వాడు అయినంత మాత్రాన ఇల ఎం బాగొలెదు.

పరిమళం చెప్పారు...

శ్రీనివాస్ గారు ,మీ బ్లాగ్ మొదటిసారి చూస్తున్నానండీ .పరిచయం బావుంది .కాని పసిడి తివాచీలు పరచినట్లుండే పంటపోలాలు, పడుచువన్నెలతో ఒంపులు తిరిగిన కొబ్బరి చెట్లు, నోరూరించే ఆవకాయ రుచులు, కల్లాపి చల్లిన... ముగ్గులతో నిండి, ముసి ముసిగా నవ్వే వాకిళ్ళు, కల్ముషమెరుగని మనసులు.. మనుషులు…ఇవన్నీ మీ పశ్చిమగోదావరికే సొంతం కాదండోయ్ ! మా తూర్పు గోదావరిక్కూడా ......ఒప్పుకోవాల్సిందే మీరు .

పరిమళం చెప్పారు...

ఇప్పటికే కొన్ని నిజాలుబైటికి వస్తూ ఉన్నాయి .నేను కొంతవరకూ కృష్ణా రావు గారితో ఏకీభవిస్తాను .ఇక పేపర్ల విషయానికొస్తే ఈ పేపర్ వీధిలోకి లాగిన వాళ్ళని ఆ పేపర్ వెనకేసుకు రావటం ,ఆ పేపర్ వెనకేసుకొచ్చిన వాళ్ళని ఈ పేపర్ వీధిలోకి లాగటం మామూలేగా !నేను మరీ లేటుగా రాస్తున్నట్టున్నా....

satya చెప్పారు...

@Mythreyi,

Ramalinga Raju should reveal the facts if he really wish to get the support from people.

"...I think Raju garu didn't take a single NP for his self."

For good sake, we need to put an end to deceive ourself.

Everyone agree that he did a very good charity and that alone will not give him purity. Now even mafia gangs are doing it. we shouldn't intersect his charity, or skills with the fraud. Better to have different views on these.

@ లలిత గారు,
ఇదే ఈనాడు ఒకప్పుడు సత్యం గురించి, రామలింగరాజు గురించి ఆకాశానికెత్తే ఆర్టికల్స్ వ్రాసింది. పత్రికల తీరే అంత.. తలచుకోటానికి బాధ గా ఉన్నా, ఇది రాజు స్వయంకృతం.

చైతన్య చెప్పారు...

తెల్లకాగితం పైన చిన్నదైన నల్లమచ్చే బాగా కనిపిస్తుంది అన్నట్టు... ఒక్క పని తో ఒక్క రోజులో ఇన్ని సంవత్సరాలు చేసినదంతా కొట్టుకుపోయింది!

Indu చెప్పారు...

hello everyone

im reading a blog in telugu for the first time. i know nothing about this IT and so called corporate. one thing is for sure there is no man with out a mistake. mistakes look bigger when lot of money is involved. its the problem creater. he is just another human like us, look at the way he brought a company up, he is better than all of us. learn from what he has achieved and also not to repeat the mistake he did. i think we need to help him come out of this. i thought i have to say this, dont take it bad.

Related Posts Plugin for WordPress, Blogger...