17, అక్టోబర్ 2010, ఆదివారం

ఇడ్లీ - అదే చెట్నీ!!


పొద్దున్నేలేచి వేడివేడి రెడ్ లేబుల్ టీ తాగుతూ బాల్కనీలోకొచ్చి ఒక్కసారి ఆకాశాన్ని చూసాను.. అబ్బా ఎన్నాళ్ళయ్యింది ప్రశాంతంగా ఇలా ఆకాశాన్ని చూసి అని మనసులో అనుకుంటూ.. చల్లని గాలి పీల్చుకున్నాను. ఈ మధ్యన ప్రాజెక్టు రిలీజ్ గొడవలోపడి.. బయట ఎండా కొండా.. వానా గీనా తెలియకుండా పోతుంది. ఈ వెధవ టెన్సల్ననుండి ఎప్పుడు బయటపడతానో ఎంటో అనుకుంటుండగానే.. ఫోన్ మోగింది.., టెస్టింగ్ టీమ్ నుండి.. అదేదో పనిచేయటంలేదని.. క్లైంట్ నుండి మెయిలొచ్చింది.., మీటింగ్ వుంది త్వరగా ఆఫీసుకు రమ్మని..., కాసేపు ప్రశాంతంగా ఉందామనుకున్నానా.. అయిపోయింది.. మళ్ళీ ఎక్కడలేని బి.పి వచ్చేసింది..

త్వరత్వరగా స్నానంచేసి రడీ అయ్యాను. నిన్ననేగా ప్రోజెక్ట్ రిలీజ్ ఇచ్చాం ఏమయ్యుటుంది మళ్ళీ.. అని అలోచిస్తూనే హాల్లోకొచ్చి మా ఆవిడిచ్చిన ఇడ్లీ ప్లేట్ అందుకుని తింటున్నా.. ఒక ఇడ్లీ మొత్తం తినేసాకా తెలిసింది.. అందులో రోజూ చేసే చెట్నీలేదని.. అల్లంచెట్నీ వేసిచ్చిందని.., చెట్నీలేందే ఇడ్లీ అస్సలు నచ్చదు నాకు.. అల్లంచెట్నీలు.. ఆవకాయ-పెరుగు చెట్నీలు ప్రత్యామ్నాయాలుగా అనిపిస్తాయి.. ఎందుకో మరి, చెట్నీలేని ఇడ్లీ నాకు - ప్లానింగ్ లేని ప్రాజెక్టులాగా.. గాలిలేని టైరులాగా..  మ్రోగలేని సెల్లులాగా..  పనిలేని టెస్టర్ లాగా కనిపించి మంట తెప్పిస్తాయి.  ఒక్కసారే.. ఉగ్రరూపం దాల్చి.. చెట్నీ చేయొచ్చుగా అన్నాను. ఏ రెస్పాన్స్ రాలేదు అవతలివేపునుండి. కానీ మాచంటాడు కెవ్వున కేకేసి ఏడవటం మొదలెట్టాడు.

అమ్మో వీడెడవటం మొదలెట్టాడు.. అనుకుంటూనే.. గడియారం వంక చూస్తూ.. టైమయిపోతుందని టెన్సన్లో ఎప్పుడు తినేసానో ఇడ్లీలన్నీ తినేసా .. కంగారు కంగారుగా పార్కింగ్ ఏరియాలోకొచ్చాను.., రోజూ.. నా టూవీలర్ సీటుని హైకులటైములో మేనేజర్ ని గోకినట్టు గోకేస్తూ నాకు దొరక్కుండా పారిపోతున్న పిల్లి.. చక్కగా బండిపైకెక్కి.. ముడుచుకుని.. టెన్సన్ లేని నిద్రతో ఎంజాయ్ చేస్తుంది.

చెట్నీలేదని ఒకపక్క... ఆఫీసులో టాస్క్  టెన్సన్ మరోపక్క..., ఈ కోపాలన్నీ ఒక్కసారి గుర్తుచేసుకుని.. హాయిగా నిద్రపోతున్న పిల్లిని..  లాగి పెట్టి నడ్డిమీద ఒక్కటి తన్నాను. అదేదో సినిమాలో చిరంజీవి గుఱ్రంతో పాటుగా లారీకిందనుండి జర్రున జారి అవతలివైపుకొచ్చినట్టుగా.. పక్కనేవున్న కారు కిందనుండి జారి అవతలికెళ్ళిపడి లేచి.. నా వంక తిరిగి చూసిందా పిల్లి. "లేకపోతే.. ఆఫీసులో టెన్సన్ క్రియేట్ చేస్తావా!!!.. చెట్నీలేకుండా చేస్తావా!!!.. నా సీటు గోకేస్తావా..!!", అని తిట్టుకుంటూ దాని కళ్ళలోకి కళ్ళుపెట్టి చూస్తూ.. పళ్ళుకొరికా.. "అవన్నీనాకేంతెలుసు.. ఏదో సరదాగా టైమ్ పాస్ కి సీటుగోకానంతే..", అన్నట్టు నా వంక చూసి మేవ్వ్ అంది... "ఛస్.. ", అని బెదిరించా.. పారిపోయిందా పిల్లి.

బండి స్టార్ట్ చేసి స్పీడుగా లాగించాను.. మా బిల్డింగ్ గేటు దాటి బయటకొచ్చాను.. దారిలో  ఆగివుంది ఒక పసుపు కలర్ లారీ.., పక్కనుండి తప్పించుకుని వెళ్ళే ఓపికలేదు.. సమయమూలేదు.. ఎవడ్రా అడ్డంగా ఆపాడు అంటూ ఎక్సలేటర్ పెంచి జుమ్మనిపించి.. లారీపైనుండి ఎక్కించేసా.. ముక్కముక్కలైపోయింది.. నా బైకు కాదు.. లారీ..!!!, ఎవరూ చూడలేదు కదా.. అని అటుఇటూ చూస్తూ.. బండి ఇంకా స్పీడుగా లాగించేసాను. ఇంకా నయం..  ఆ ఐస్క్రీమ్ బండిదగ్గర ఐస్క్రీమ్ కొనుక్కుంటున్న చిన్నపిల్లాడు వెనక్కు తిరిగి చూడలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే కింద పడి "నా బొమ్మ లారీ నాకిచ్చేయ్..", అని ఏడ్చి.. గీ.. పెట్టేవాడు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాను.

ఆఫీసు చేరుకున్నాకా బలవంతంగా పార్కింగ్ ఏరియాలో రెండు దున్నపోతుల్లావున్న యమహా.. బైకులమధ్యన నా బండిని ఇరికించటంవల్ల అటుఇటూ ఒక గీత పడింది.. అరెరే.. ఎంత జాగ్రత్తగా చూసుకునే బైకిలా అయిపోయిందేంటా అని. ప్రాణం చివుక్కుమంది..

అక్కడనుండి మొదలయింది నా బ్యాడ్ డే... ఆ రోజంతా గజిబిజి గందరగోళం.. ఒకడికనుకుని ఒకడి మెయిల్ పంపించి నీకు మెయిలిచ్చాను కానీ నువ్వు రిప్లై ఇవ్వలేదు, అది నా తప్పుకాదని పెద్ద దెబ్బలాటపెట్టుకున్నా,వాడేమో నాకు రాలేద మొర్రో అని తలపట్టుకున్నాడు. తీరా వెళ్ళి నా మెయిల్ సెంట్ అయిటమ్స్ లో చూస్తే రమేష్ అన్నవాడికి పంపబోయి.. రాహుల్ అన్నవాడికి పంపానని తెలిసింది. ఎడ్రస్ బార్లో.. R అని కొట్టగానే అవుట్ లుక్లో ఏదొస్తే అది చూడకుండా ఎంటర్ కొట్టేయటం వల్లే కదా.. ఇలా జరిగింది.., ఎధవ ఐ.టి బద్దకం..,  ఛ అనుకన్నా.

ప్రోజెక్ట్ టెస్టింగ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చెయ్యాలి మీటింగ్ అన్నారు. ఏంటో తాడో పేడో తేల్చేయాలి.. అని తొడకొట్టుకుంటూ.. లేని మీసం తిప్పుకుంటూ.. మీటింగ్ రూమ్ వైపు బయలుదేరాను. గంటన్నర చెమటలు పట్టేలా డిస్కస్ చేసి.. ఎనాలసిస్ అని తలకాయని..  అందరూ తమతమ అభిప్రాయాలు చెప్పాకా తెలిసింది తేలింది ఏంటంటే.. మా క్లైంట్ గాడు పొద్దుపొద్దున్నే బెనడ్రిల్ కాఫ్ సిరప్ తాగొచ్చు... మత్తుమత్తు కళ్ళతో పురాతన వెర్షన్లో వేలుపెట్టి టెస్ట్ చేసి..,  మీరేమీ చెయ్యకుండా కొత్త బిల్డ్ ఎలా పంపారు అని సీరియస్ గా మెయిల్ రాసాడని. హమ్మయ్యా మనవైపు ప్రోబ్లమ్ ఏమీలేదన్నమాట.. అని అందరూ ఊపిరి పీల్చుకుని వాడిని బండబూతులు తిట్టుకున్నారు.. కానీ నాకు మాత్రం పాపం వాడికీ ఇడ్లీలో చెట్నీ ఏనచ్చోవుండదులే.. అదే ఎఫెక్ట్ అయ్యుటుందని సర్దిచెప్పుకున్నాను.

మీటింగ్లో మాట్లాడి మాట్లాడి ఓపికలేక.. పాక్కుంటూ నాసీటు దగ్గరకొచ్చేసరికి.. ఎక్కడనుండో లోకల్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది..., నీరసంగానే ఎత్తి హలో అన్నా.., "నమస్తే  సార్..", అంది ఒక ఆడగొంతు.."యస్..", అన్నానేను.. "సార్.. మీరు ఈ సంవత్సరం టాక్స్ సేవింగ్ ప్లాన్ చేసారా.. కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ బాండ్స్ పై...", అని.. ఏదో చెప్పబోతుంటే.. "నేను స్టూడెంటును ఆంటీ..,  ఇప్పుడే నిక్కరేసుకుని.. స్కూలుకు బయలుదేరుతున్నా ఆంటీ...", అని అనేసరికి.. ధబ్మని సీటునుండి కిందపడిపోయిన శబ్దంలా ఏదో శబ్దంతో ఫోన్ కట్ అయిపోయింది. పీఢా విరగడయ్యింది అనుకుని నా సీట్లో కూర్చున్నా.

పద సిగరెట్ అని.. మా డాటాబేస్ వాడు నన్ను లాక్కుపోటానికి నా దగ్గరకొచ్చాడు.. నాకెలాగూ సిగరెట్ అలవాటు లేదు.. ఆ వదిలే ప్రొగపీల్చటం తప్ప.., సరేపద.. అది పీల్చితే అయినా ఈ టెన్సన్లు కాస్త తగ్గుతాయేమోనని.. వాడితో కిందకు వెళ్ళాను...

ఈ రోజంత ఇలావుందేంటబ్బా అని అలోచించగా.. ఇవన్నీ ఆ చెట్నీకి సైడెఫెక్టులేలా అనిపించాయి..వెంటనే  ఈవిషయాలన్నీ మా ఆవిడకు చెప్పాలని ఫోనుచేసాను. అన్ని కుశల ప్రశ్నలు వేసాకా.., ఇవాలా ఇలా జరిగింది.. అదిలా అయ్యింది. ఇదిలా ఏడ్చింది.. ఇవన్నీ చెట్నీసైడెఫెక్టుల్లాగా అనిపిస్తున్నాయి.. అని మొదలుపెట్టాను. అప్పటిదాకా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న మా చంటాడు..డీటియస్..డాల్బీ స్టీరియో మింగేసినట్టు ఏడవటం మొదలుపెట్టాడు.. వీడేడుస్తున్నాడు నాకేమీ వినిపించటంలేదు.. మళ్ళీచేయండి అనగానే ఫోన్ కట్ చేసేసా.. మళ్ళీ ఒక పావుగంటయ్యాకా చేస్తే మళ్ళీ అదే గొడవ.. ఐదునిమిషాలు కేరింతలు కొట్టాడు చెట్నీ మాటెత్తగానే డాల్బీ ఏఫేక్ట్..ఈ సారి వాడి నోటిదగ్గర ఫోన్ పెట్టిందేమో.. అమ్మో.. వీడిసౌండుకన్నా నా ప్రాజెక్ట్ గొడవలే బెస్ట్ అని ఫోన్ పెట్టేసి.. మళ్ళీ ఫోన్చేస్తే ఒట్టు.

ఇంటికొచ్చాకా..,చంటాడు పడుకున్న సమయం చూసుకుని.. మొత్తం జరిగిందంతా చెప్పాను.., చెట్నీలేని బతుకు.. దుర్భరం.. అన్యాయం, అక్రమం.. ఆవేశం ఆయాసం.. అని నా గోడు వినిపించి ఆయాసపడ్డాను. సరే సరే.. పాయింట్ నోటెడ్..రేపట్నుండి చెట్నీ మర్చిపోకండా చేస్తా అని.. హామీ ఇచ్చి కరపత్రం పై సంతకం చేసింది మా ఆవిడ.

తరువాతరోజు పొద్దున్నే యధావిధిగా ఆఫీసుకు రడీ అవుతున్నాను. టీ.వీ పెట్టి చూస్తూ మళ్ళీ ఇడ్లీప్లేటందుకున్నాను... అదే ప్లేట్.. అవే ఇడ్లీలు.. కానీ నేనుకున్న చెట్నీకాకుండా..మళ్ళీ అల్లంచెట్నీవుంది. ఇదేంటిది.. అని మళ్ళీ క్లాస్ మొదలుపెట్టాను.. ఇంతచెప్పినా నువ్వు మారలేదు.. మర్చిపోయావ్.. అది ఇదీ.. ఆట్.. ఊట్.. అల్లంచెట్నీ అని చెడమడా తిట్లు అందుకున్నా.., తిట్టి తిట్టి.. ఆవేశపడి... చెమటలు తుడుచుకున్నాను.

ఒక ఐదు నిముషాలు నిశ్శబ్దం..

ఆవేశపడకండి.., ఈ మంచినీళ్ళు తాగండి.. అని మంచినీళ్ళ గ్లాసు చేతికిచ్చి.. ఇదిగో చెట్నీ!!... చేసాను.., మీరేమంటారో అని అల్లంచెట్నీవేసా అంతే.. అని.. ప్లేట్లో వడ్డించింది.

ప్రక్కనే దివాన్ కాట్ పై.. ఆన్ యువర్ ఆర్మ్స్ అనగానే.. పరుగెత్తటానికి రెడీగా వున్న అథ్లెట్ లాగా.. మోకాళ్ళపై నిలబడి.. హిహీహీ.... అని కేరింతలుకొట్టి వెక్కిరించినట్టు నవ్వాడు మా చంటాడు.

17 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

హ హ హ ... ఆఖరు పంచ్ అదిరింది :-))
ఇంతకీ ఒక చెట్నీనా ...రెండా ??

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

హన్నా!హెంత పన్జేసిందీ చెట్నీ!

కృష్ణప్రియ చెప్పారు...

-) చాలా బాగుంది. ముఖ్యం గా ఆవేశం ఆపుకోలేక టూ వీలర్ తో లారీ ని ముక్కలు ముక్కలు చేయటం..
మా ఇంట్లో కూడా.. ఇడ్లీ ల్లో కి చట్నీ లేకపోతే.. అన్న ప్రశ్నే లేదు.. చట్నీ చేయకపోతే ఎవ్వరూ యధాలాపం గా కూడా వాటికేసి చూడరు..

3g చెప్పారు...

హ హ్హ హ.......
నేనైతే చట్నీ ఉన్నాకూడా అది వదిలేసి మాగాయ-పెరుగు కాంబినేషన్ తో లాగిస్తా ఇడ్లీని. భలే ఉంటుంది.

Unknown చెప్పారు...

Roju morning lechi Orkut, Facebook..etc check chesethey English breakfast Bread/Jam laaga untundi..

kaani ee roju levagane mee blog chadivithey..telugu idli chatni thinnattu undi :-)

శ్రీనివాసరాజు చెప్పారు...

@మంచు గారు
టపా నచ్చినందుకు సంతోషం.
ఒక చెట్ని చేయటానికేలేదంటే.. రెండెక్కడినుండి వస్తాయండి.. అందుకే గూగుల్ లో ఇమేజ్లో అయినా రెండు చెట్నీలు చూసుకున్నా :-)

@విజయమోహన్ గారు
:-) నచ్చినందుకు సంతోషం

@కృష్ణప్రియ గారు
మరి ఇడ్లీకి చెట్నీయే ప్రాణంమండీ.. ఏ రాష్ట్రం పోయినా ఇడ్లీ అదే స్టయిల్లో వున్నా.. తేడా చెట్నీలోనే తెలుస్తుందిగా మరి. :-)

@3g గారు
నాకూ ఆ పెరుగు కాంబినేషన్ ఏ చెట్నీయైనా ఇష్టమే.. కాని అప్పుడప్పుడూ.., అస్తమానూ అదే అంటే కష్టమే. ఇష్టం అన్నామంటే రోజూ అదే వస్తుంది ప్లేట్లోకి.. అందుకే :-)

@శ్రవణ్ కుమార్ గారు
ఈ రోజైనా తెలుగు ఇడ్లీ-చెట్నీ రుచిచూసినందుకు ఆనందంగా వుంది. :-)


ధన్యవాదములు.

శిశిర చెప్పారు...

ఇడ్లీలోకి చట్నీ లేకుండా తింటే ఇన్ని అనర్ధాలు జరుగుతాయన్నమాట. ఇక ఇలాంటి అనర్ధాలు జరుగకుండా నిత్య చట్నీ ప్రాప్తిరస్తు! :)

కౌటిల్య చెప్పారు...

పోస్టు చదివేశానోచ్! కానీ నాకు జొరం గా! అందుకే కామెంటు మళ్ళా రాస్తానేం!......(స్వగతంలో,"అయినా మొదటి కామెంటు మనది కానప్పుడు ఇక రాయటమెందుకూ" అంట....)...:-))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

పాపం ఒక్క చట్నీ ఎన్ని అనర్థాలకు దారితీసింది :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@శిశిర గారు
అవును నిత్య చట్నీ ప్రాప్తిరస్తు! అని ఆశిద్దాం. :-)

@SRRao గారు
మీకు మీ కుంటుంబానికి కూడా ఆ జగజ్జనని సకల శుభాలను ప్రసాదించాలను కోరుకుంటున్నాను.
ధన్యవాదములు
@కౌటిల్యగారు
మీరు కామెంటివ్వకపోయినా పర్వాలేదులేండి నేనేమనుకోను. మీరు మరీ మొహమాటపడి ఇస్తున్నట్లున్నారు :-)
నేనేదో ఫోర్స్ చేసి కామెంట్లు ఇప్పించుకుంటున్నట్టు అనుకుంటారు చదివేవారంతా.. హి హీ.. :-)

@వేణూ శ్రీకాంత్ గారు.
మీ కామెంటుకు ధన్యవాదములు. చెట్నీ ఒక్కటే.. అనర్ధాలు ఎన్నెన్నో.. :-)

శివరంజని చెప్పారు...

ఇడ్లీ కి వేరు శనగ పప్పు చట్నీ మంచి కాంబినేషన్ అండి ....
మా ఇంటిలో రోజు ఇడ్లీ , ఉప్మా ఇవయితేనే త్వరగా అవుతాయని చెప్పేసి మా అమ్మ గారు ఇవే చేస్తారు ... వీలయితే చట్నీ చేస్తారు లేకపోతే ఆవకాయో మాగాయో వేసుకోమటారు మాగాయ-పెరుగు కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది అండి

రాధిక(నాని ) చెప్పారు...

ఆగివుంది ఒక పసుపు కలర్ లారీ.., పక్కనుండి తప్పించుకుని వెళ్ళే ఓపికలేదు.. సమయమూలేదు.. ఎవడ్రా అడ్డంగా ఆపాడు అంటూ ఎక్సలేటర్ పెంచి జుమ్మనిపించి.. లారీపైనుండి ఎక్కించేసా.. ముక్కముక్కలైపోయింది.. నా బైకు కాదు.. లారీ..!!!, ఎవరూ చూడలేదు కదా.. అని అటుఇటూ చూస్తూ.. బండి ఇంకా స్పీడుగా లాగించేసాను. ఇంకా నయం.. ఆ ఐస్క్రీమ్ బండిదగ్గర ఐస్క్రీమ్ కొనుక్కుంటున్న చిన్నపిల్లాడు వెనక్కు తిరిగి చూడలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే కింద పడి "నా బొమ్మ లారీ నాకిచ్చేయ్..", అని ఏడ్చి.. గీ.. పెట్టేవాడు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాను.
బాగుందడి :):)
ఇడ్లీలొ చెట్నీ లెకపొతే ఇన్నికష్టాలా?మా ఇంట్లో ఆప్రొబ్లం లెదు మా పిల్లలకి మాగాయపచ్చడి,వెన్నపూస ఉంటే చాలు.

ఇందు చెప్పారు...

హ్మ్!! ఆఖరికి పాపం చెట్నీ చేసిందన్నమాట ఇంత పని :)) ఇడ్లీలోకి అల్లప్పచ్చడి బానే ఉంటుంది కదండీ..!!అయినా అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వాలి మరి!! నేనైతే అల్లప్పచ్చడే ప్రిఫర్ చేస్తా!! పుల్లగా-తీయగా-కారంగా భలే ఉంటుంది :) మరీ పాపం దాన్ని అంత తీసిపడేయక ఈసారి చట్ని లేనపుడు అల్లప్పచ్చడి తో కానిచ్చేయండి :))

శ్రీనివాసరాజు చెప్పారు...

@శివరంజని గారు
రోజీ ఇడ్లీ తిన్నా డెడ్లీగా వుంటుందండీ.. కాస్త చేంజ్ చేసుకోవటమే బెటర్. :-)

@రాధిక(నాని) గారు
హుమ్మ్.. మాగాయి-వెన్నపూస భలే కాంబినేషన్.. సిటీలోవున్నవాళ్ళకు స్వచ్చమైన వెన్నపూసెక్కడ దొరుకుతుందిలేండి.

@ఇందుగారు
అల్లప్పచ్చడి నాకు ఇడ్లీలోకన్నా అప్పుడప్పుడూ దోశల్లో.. లేక పెసరట్లలో ఇష్టం. నేను చెప్పేది నిలవవుండే (ఆవకాయలాగా) ఉండే అల్లప్పచ్చడిలో కాస్త పెరుగేసి కలిపిపెడతారే అది.., మరిది ప్రత్యామ్నాయంమే కదా మరి. :-)

Geetha Sagiraju చెప్పారు...

"mukka mukka layyindi na bike kadu lorry"..


super timing asalu.. chala bagundi..


chatni entha pani chesindi...
anduke nenu idly thinanu.. ;)

yeswanth చెప్పారు...

idhi na okkadi problem anukunna,kaadhannamata. idhi universal problem kaabatti manam andharam discuss chesukuni solution kanipettali.

Unknown చెప్పారు...

Chutney leni idli gurunchi baga rasaru.naku kuda sambar unna chutney kavali.kudarani timelo we can adjust with some alternates.Chutney theme base chesi baga rasaru.I like your writing style sounds like talking in the home(intlo roju mataladukunnatlu)

Related Posts Plugin for WordPress, Blogger...