22, సెప్టెంబర్ 2010, బుధవారం

బకాసురులు - 3


(రీల్ అతుక్కుంది.. ఈ కధకు బయ్యర్స్ ఎవరూ రాకపోవటంతో.. చిన్న ధియేటర్లవాళ్ళని బ్రతిమలాడి ఇచ్చుకోవటంవళ్ళ ఇలా రీళ్ళు తెగిపోతున్నాయి.. అంతరాయాలకి చింతిస్తున్నాము.. )

అది దగ్గర్లోవున్న బడా కార్పొరేట్ హాస్పిటల్.. ఒక్కసారి.. హాస్పిటల్ ఎంట్రన్సు గేటుపై లాంగ్ షాట్..హాస్పిటల్ పేరుపై ఒక క్లోజప్ షాట్.. కట్ చేస్తే... టోయ్. టోయ్.. టోయ్.. అంటూ వచ్చిన అంబులెస్స్ కూతలు.., జనాల ఆర్తనాదాలు.., హడావిడిగా తిరుగుతున్న డాక్టర్లు.. కొత్తకొత్తబట్టలువేసుకుని స్ట్రెచ్చర్ పై పడుకున్న పేషెంట్లు.., ప్లేట్లో.. ఇడ్లీ..దోశ.. పెసరట్టుప్మా తీసుకెళుతున్నట్టుగా.. ఒక సెలైన్ బాటిల్.. ఒక కాటన్ రోల్.. ఒక బ్లడ్ బాటిల్ .. ఒక సిరంజి పెట్టుకుని.. పరుగులు తీస్తూ పట్టుకెళ్తున్న నర్సులు.. ఇవ్వన్నీ నిజంగా కళ్ళముందులేకపోయినా... తెలుగు సినిమాలు చూసిచూసి.. అదేరకంగా వూహించుకుంటూ.. ఒణికిపోతున్నాడు బొండు భద్రం. అలా ఒణికిపోతూనే కారురివర్స్ గేరువేసినట్టుగా.. వెనక్కెనక్కి వెళ్ళిపోతున్నాడు.

రిసెఫ్సన్ దాకా వచ్చిన చుండ్రు రమణకి... అప్పటిదాకా పదిచెక్రాల లారీ పక్కన నడిచొచ్చిన ఫీలింగ్ ఒక్కసారిగా మిస్సయ్యేసరికి.. "బొండుగాడేడ్రా..", అని నల్లశీనుని అడిగాడు.. ఇద్దరూ వెనక్కు తిరిగి చూసారు.. గుళ్ళోకివెళ్ళకుండానే.. గుడిపైనున్న రాఘవేంద్రరావుగారి సినిమాలో హీరోయిన్ బొమ్మల్లాగా కనిపించిన బొమ్మలను చూసి కళ్ళుతిరిగిపడిపోయిన భక్తుడు.. కిందపడి.. గిలగిలా కొట్టేసుకున్నట్టు.. హాస్పిటల్ గేటు దగ్గర పడిపోయున్నాడు బొండుభద్రం. జేబులోనుండి కఫ్ సిరప్ అంత చిన్న బాటిల్ బయటపడి.. దొర్లుకుంటూ దొర్లుకుంటూ.. సరిగ్గా పాయిజన్ అని ఇంగ్లీషులో రాసున్నఅక్షరాలు కనిపించేవిధంగా ఆగింది.. (సరిగ్గా ఎలా ఆగింది అనే కదా మీ డౌటు.. ఎన్ని టేకులు తీసుకుంటే ఈషాట్ వచ్చిందో మీకేంతెలుసు.., అయినా సినిమా చూసి.. ఛీ ఎధవ సినిమాఅనేస్తారు.. అదే కదా ప్రాబ్లమ్)

అది చూసిన సెక్యూరిటీ గార్డ్.. "పాయిజన్ కేస్..", అని స్ట్రెచ్చర్ పట్టుకున్న బాయ్ ని పిలుస్తూ ఆర్తీ అగర్వాల్ లా ఆర్తనాదం చేసాడు. ఒకపది మంది సాయం అడిగి బొండు భద్రాన్ని అతి కష్టంమీద స్ట్రెచ్చర్ పై ఎక్కించారు. ట్రాలీ తోసుకుంటూ వెళుతున్నారు.. చక్రాలు కిచ్ కిచ్ మని శబ్దంచేస్తున్నాయి... సీలింగ్ పై లైట్లు వెనక్కు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. మిగతా ముగ్గురూ ట్రాలీతోపాటే పరుగెడుతున్నారు.

"ఏరా.. ఇప్పటిదాకా బాగానేవున్నావుగా.. అంత సడెన్ గా ఎలా పడ్డావ్",అని ట్రాలీ తో పాటే పరుగుతీస్తూ బొండుభద్రం చెవిలో గుసగుసలాడాడు కుక్కల సతీష్.
"నాకు చిన్నప్పటినుండి హాస్పిటల్ అంటే చాలా భయంరా.. చిరంజీవిని చూడగానే కాళ్ళువొణికిపోయేవి..", అన్నాడు బొండుభద్రం.
"చిరంజీవి కాదెహే...సిరంజి.., సరేలే కానీ.. గీతాంజలి సినిమా చూసావా?", అనడిగాడు చుండ్రు రమణ.
"ఒరే.. ఆ సినిమాలు.. స్టోరీలు అవసరమా ఇప్పుడు?", అనడిగాడు బొండుభద్రం.
"మరదే.. అందులో హీరోయిన్ కి కేన్సర్ అని తెలిసాకా.. హాస్పిటల్ కి తీసుకెళుతున్నప్పుడు సీన్లో ఆమె ఎలా ఏక్ట్ చేసిందో.. ఫ్రేమ్ టుప్రేమ్ అలానే ఏక్టింగ్ చెయ్యి.., నువ్వేం భయపడకు.. మేమున్నాం.. నువ్వు కుమ్మేయ్.., సిరంజి లేకుండానే.. ఇంజక్షన్ సెలైన్ ద్వారా ఇవ్వమని నర్సుకి చెబుతాంలే.. ", అని సలహా ఇస్తూ  ధైర్యం (తేజ సినిమా  ధైర్యం కాదు) చెప్పాడు చుండ్రు రమణ.

ట్రాలీ చక్రాల కీచ్ కీచ్ శబ్దాలు వింటూ.. సీలింగ్ పై వెనక్కు పరుగెడుతున్న లైట్లు చూస్తూ.. బొండుభద్రం ఒక పదిసెకన్లు.. ప్లాస్బాక్ లోకి వెళ్ళాడు. గీతాంజలి సినిమాలో ఆ సీన్ ఒక్కసారి ఊహించుకున్నాడు.. ఇరగదీసేసి ఏక్ట్ చేసేసాడు. ట్రాలీని నడుపుతున్న బాయ్స్ ఇంకా ఫాస్ట్ గా తోసుకుంటూ.. ఐ.సి.యు వైపు తోసుకు వెళుతున్నారు. ఆ ముగ్గరూ ఇంకాఫాస్ట్ గా ట్రాలీతోపాటే పరుగెడుతున్నారు.

"ఒరేయ్..మరీ ఎక్కువ ఏక్ట్ చెయ్యకు.. ఆ హీరోయిన్లాగా నీకు క్యాన్సర్ అని ట్రీట్మెంటిచ్చేయగలరు.. పాయిజన్ కేసులా చెయ్యి చాలు", అని చెప్పాడు నల్లశీను.

ట్రాలీ ఐ.సి.యు లోపలికెళిపోయింది.. గోడమీదనున్న రెడ్ లైట్ వెలిగింది.

రిసెఫ్సన్ దగ్గరకెళ్ళి.. హెల్త్ కార్ట్ చూపించి.. వివరాలు కనుక్కున్న చుండ్రురమణ.. టామ్ అండ్ జర్రీ షోలో.. జర్రీని పట్టుకోలేక.. అలసిపోయి.. చేతులు వేళాడేసుకుని.. చెమటలు తుడుచుకుంటూ దిగాలుగా వున్న టామ్ లాగా.. నడుస్తూ వచ్చాడు.
"ఒరే.., ఈ ఎమర్జెన్సీలో ఇన్సూరెన్స్ కంపెనీవాళ్ళని కాంటాక్ట్ చేసి.. వారిదగ్గరనుండి రిప్లైవచ్చేదాకా వెయిట్ చేయలేమండి. ముందు కేష్ కట్టేయండి.. తరువాత ఈ బిల్లులన్నీ పంపిస్తే.. ఆ డబ్బులు మీకు అన్నీ వచ్చేస్తాయని.. చెబుతుందిరా రిషెఫ్సనిస్టు..", అన్నాడు చుండ్రు రమణ.

"అంతే కదా.. నా క్రెడిట్ కార్డుతో కట్టేస్తా.. తరువాత డబ్బులొస్తాయి.., దీనికే టెన్సనెందుకురా.. ", అని చెప్పాడు నల్లశీను.

ఇంతలో డి.టి.యస్ ఎఫెక్టుతో పెద్ద పెద్ద పొలికేకలు.. పెడబొబ్బలు.. ఐ.సి.యు రూమ్ నుండి వినిపించడం మొదలుపెట్టాయి.., పైనున్న రెడ్ లైట్ ఆరిపోయింది.. ఐ.సి.యు రూమ్.. తల్లకిందులైపోయింది. (నిజంగా తల్లకిందుకాదు.. కెమోరా ఉల్టా తిప్పాం.. :-) )

అదంతా చూస్తున్న ఆ ముగ్గురికీ చెమటలు పట్టేసాయి.., సినిమాళ్లలో విలన్ వేసుకొచ్చిన కార్లు. వరుసగా వచ్చి.. వరుసగా ఆగి.. టఫ్ టఫ్ టఫ్.. అని ఒక్ససారిగా డోర్లు తీసినట్టుగా.. ఆ ముగ్గురూ ఒక్కసారిగా టఫ్ టఫ్ టఫ్ అని.. కూలబడిపోయారు... వాళ్ళ జేబుల్లోంచి.. అవే.. కఫ్ సిరప్ బాటిల్లంత బాటిల్లు కింద పడ్డాయి.. మళ్ళీ అలాగే దొర్లకుంటూ పాయిజన్ అని రాసున్న ఇంగ్లీష్ అక్షరాలు దగ్గరే ఆగాయి. ఒక్కసారిగా సీన్ చీకటైపోయింది.

***

అది రాత్రి.. కానీ డిస్కో లైట్లకాంతిలో పగల్లావుంది.. ఒకడి మాట ఒకడికి వినపడనంతగా ధుబ్ ధుబ్మని బీట్ తో వస్తున్న రాక్ సాంగ్స్.. చుట్టూ పార్టీ వాతావరణం.
ఆ నలుగురూ.. తినటం మొదలుపెట్టారు.. తింటూనే నోట్లో మాటవచ్చేటంత కాలీ చేసుకుని.. "ఏరా.., ఐ.సి.యులోంచి.. అంతలా అరిచావ్.. ఏంచూసావ్ రా లోపలా.. ", అనడిగాడు నల్లశీను.. ప్లేటుతో సహా చికెన్ చిల్లీ.. తినేస్తున్న బొండుభద్రాన్ని.

"నర్సు చేతులోవున్న చిరంజీవిరా..", అన్నాడు బొండుభద్రం.

హహాహా.. "కరెంటు పోయి లైటాగిపోతే.. మేమంతా నువ్వు జెండా.. అనుకున్నాంరా", అన్నాడు చుండ్రు రమణ.

కాలం గడిచింది... (ఈ ఊత పదానికి ఇదే ఆఖరులేండి.. తిట్టుకోకండి..)

హాస్పిటల్ బిల్లు పేరు చెప్పి.. చుండ్రు రమణకి పదివేలు.. కుక్కలసతీష్ కి పదివేలు.. బొండు భద్రానికి పదిహేనువేలు.. నల్లశీనుకి.. ఇరవైవేలు ఖర్చయ్యింది. అదే చూపిస్తూ క్రెడిట్ కార్డు బిల్లొచ్చింది నల్లశీనుకి. "ఎంతొస్తే ఏంటిలే..", అని ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసాడు బొండు భద్రం.

"పాయిజన్ కేసు.. సుసైడ్ ఎటంప్ట్ కిందకు వస్తాయి సార్.. మా పాలసీ అది కవర్ చెయ్యదు... ఇది.. మా బుక్ లెట్.. నూటముఫ్ఫైమూడోపేజిలో.. నాలుగోలైన్లో రాసాము.. అది చదువుకొని.., అందులో ఏమన్నా సహాయం కావాలంటే.. మా కాల్ సెంటర్ కి కాల్ చేయండి.. మీరు మాట్లాడుతున్నది సిల్క్ స్మితతో... శుభోధయం.. ధన్యవాదాలు", అని చిలకలా నవ్వుతూ మాట్లాడి ఫోన్ పెట్టేసింది.. కాల్ సెంటర్ అమ్మాయి.

ఆ న్యూస్ విన్న నలుగురికీ కడుపులో దేవేసి.. అప్పుడెప్పుడో పార్టీలో తిన్నదంతా.. ఇప్పుడు బయటకొచ్చినంత పనైంది.

ఆగండాగండి.. అప్పుడే పార్కింగ్ టికెట్ట్ వెతుక్కుంటూ.. సీట్లోంచి లేచిపోతున్నారా?, మరదే.. ఇక్కడో చిన్న ట్విస్టుంది.. అదికూడా చూసి(చదివి) వెళ్ళండి.

బిల్లెలాగూ తప్పేట్టులేదని తెలుసుకున్న ఆ నలుగురూ.. హాస్పిటల్ కి వెళ్ళి.. అందరివీ ఒకటే కేసులు కదా.. మరి బిల్లెందుకు వేరువేరుగా వచ్చిందని గొడవపెట్టారు.

బొండు భద్రం టాంక్ కాస్త పెద్దదనీ.. అది క్లీన్ చెయ్యటానికి స్పెషల్ గా మున్సిపాలిటీవాళ్ళను తీసుకురావల్సొచ్చిందనీ.. అందుకే పదిహేనువేలన్నారు.

నల్లశీను జేబులోనుండి రెండు కఫ్ సిరప్ బాటిల్లంత బాటిల్లు పడ్డాయని.. ఒకదానిమీద పాయిజన్ అని రాసుండగా.. వేరేదానిపై ఏమీ రాసిలేని తెల్లకాగితం అంటించి వుండటంతో.. ఏదో తెలియని విషం తాగుంటాడు అని.. ఆ తెలియని క్లీనింగ్ కి.. ఇరవైవేలయ్యిందని తేల్చిచెప్పి.., నలుగుర్నీ మెడపట్టి బయటకు గెంటేసారు హాస్పిటల్ వాళ్ళు.

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఎండింగు బ్రహ్మాండం !!

కౌటిల్య చెప్పారు...

సెకండ్ కామెంట్ అన్నా నాది కావాలని ఇంత వరకే రాసి పంపేస్తున్నా! మిగతా భాగం తరువాత కామెంటులో..ః-)

కౌటిల్య చెప్పారు...

మూడో కామెంటూ నాదేనోచ్!...అయినా పేషెంట్ కి కొత్తబట్టలేంటీ!!...పాయిజన్ కేసుల్ని డవిరెక్టుగా ఐసీయూలోకి తీసుకెల్లరు రాజు గారూ..ముందు కక్కించి తర్వాత పెడతారు..

ఇంతకీ నల్లశీను తాగిన రెండో బాటిల్ ఏంటి??....ః)))

m@lli_V@rma చెప్పారు...

Hello Srinu it's really good.....
characters bondu bhadram,
Nalla seenu,
Kukkala Satish,
Chundru Ramana
Nice Narration...

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఫణిబాబు గారు.
మీకు నచ్చిందంటే ఈ టపా సూపర్ హిట్టుకొట్టినట్టే. (సినిమా ఆడనీయండి ఆడకపోనీయండి అదే వేరే విషయం)

@కౌటిల్య గారు
టీ.వీ సీరియల్ జీడిపాకాలు చూసి.. ఏఁ మేం సాగదీయలేమా.. అని బకాసురులను మూడు వారాలు సాగదీస్తే.. మీరు కామెంటుని కూడా సాగదీస్తారా???.

ఆగండి ఆగండి.. నేను చెప్పేది మీ హాస్పిటల్ లో విషయం కాదండీ.. తెలుగు సినిమాలో తలకు చిన్న దెబ్బతగిలినా సరే.. ఐ.సి.యుకే.., ఫేషెంట్లకు కొత్తబట్టలే.. నర్సుల ప్లేట్లో.. అవే పెసరట్టుప్మాలే.. అది తప్ప ఏం చూపించారో.. ఒక్క సినిమా ఉదాహరణ ఇవ్వండి :-)

నల్లశీను తాగిందేంటో.. అసలు పాయిజన్ బాటిల్ పై అలా రాయటంఎందుకో.. మీకే తెలియాలి.

@మల్లి
టపా నచ్చినందుకు సంతోషం.. నీ బ్లాగు.. ప్రొఫైల్.. చూసాను.. ప.గో. కి పోటీ కాదు కదా!

..nagarjuna.. చెప్పారు...

మీరు వంశీగారి మాదిరి రాయడం మాత్రమే కాదండొయ్ ఆయనలాగా, కృష్ణవంశీలాగా స్క్రీన్‌ప్లే కూడా ఇచ్చారు...

శ్రీనివాసరాజు చెప్పారు...

@నాగార్జున గారు
టపా నచ్చినందుకు సంతోషం.
వంశీగారిలాగా.. కృష్ణవంశీలాగా కాకుండా.. శ్రీనివాసరాజు లాగా.. స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎప్పుడిస్తానా అని ఆలోచిస్తున్నా.., ఆయనెవడు అనుకుంటున్నారా.. ఒక్క బొమ్మపడిందనుకో... :-)

Usha చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Usha చెప్పారు...

Helo Srinivas garu namaste
chaalaa rojulaki log in ayyaanu so just mee comment chusa ventane reply ivvatam maryaada ani eng. lo rasestunnaa so yemi anukokandi.last 2 months maa elderson marriage hadavidi valana no OL anna mata nenu ippudu PUNE lo unnaa. Actual gaa eeroju vellipovaali Hyd ki but ee Ayodhya godava yemavutundo ani risk teesukovadam istam leka undipoyemu annamata so just log in ayyaa blog open chesesariki mee post kanipinchindi so ventane reply rayalanipinchi rastunnaa annattu meeru PUNE nivaasi anukuntaa kadaa maa abbaayilu iddaru kuda PUNE lone Jobs undedi Baner area lo
koddiga kaali chusukoni mee TAPAA chaduvuthaa

untaa
USHA

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఉష గారు
అయితే మొత్తంమీద పూణే వచ్చి కలవకుండా వెళుతున్నారు. నేనుండేది కాసార్ వాడి. బానేర్ కూడా మాకు దగ్గరే..అంటే.. ఒక ఏడెనిమిది కిలోమీటర్లుంటుంది.

టపా చదివి మరి చెప్పండి ఎలా వుందో..
మీ కామెంటుకు ధన్యవాదములు. :-)

Raghuram చెప్పారు...

బ్రహ్మాండం !!!

శ్రీనివాసరాజు చెప్పారు...

రఘురామ్ గారు

మీకు నచ్చినందుకు సంతోషం.

Related Posts Plugin for WordPress, Blogger...