10, మే 2010, సోమవారం

సాక్షిపత్రికలో నా బ్లాగు

మే 5వ తారీఖు(బుధవారం) సాక్షి దినపత్రిక, హైద్రాబాద్ ఎడిషన్లో.. స్ధానికం కాలమ్లో, బ్లాగు బాగు అనే శీర్షికలో నా బ్లాగు పేరు ప్రస్తావించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని నాకు ఈమెయిలు ద్వారా తెలియచేసిన జ్యోతి వొలబోజు గారికి ధన్యవాదములు..

ఈ బ్లాగులో రాస్తున్న ప్రతి అక్షరం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. చదువుతున్న వారు కూడా ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను.

సరదాగా మొదలుపెట్టిన ఈ బ్లాగింగ్.. బాధ్యతగా.. వ్యసనంగా మారి నాచేత ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేయిస్తూ నాలో ఎక్కడో దాగివున్న కొత్త ఆలోచనలను బయటకు తీస్తుంది.. ఈ బ్లాగ్ ప్రపంచమే లేకపోతే అవన్నీ నా మనసులో ఆలోచనలుగానూ, ఆశలుగానే ఉండిపోయేవేమో!!

ఈ ఈ-తెలుగుకు ఊతమిచ్చి మనందరినీ ఒకచోట కలుకునే అవకాశం కలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఈ బ్లాగుభంధం ఎలాంటిందంటే.. నాకు ఇప్పుడు ఉన్న స్నేహితులలో సగంమంది బ్లాగుద్వారా పరిచయమైనవారే వున్నారు. సరదాగా చాటింగ్లో పలకరిస్తూ వుంటుంటారు.. , కొందరిని కలిసి ఆనందాలను పంచుకున్న సమయాలూవున్నాయి.. ఇది ఒక కుటుంబంలా మారిపోయింది.. 

ఇలానే ఇంకా ముందుముందు మీ విలువైన అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

మీ
శ్రీనివాసరాజు ఇందుకూరి

12 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అభినందనలు
కృతఘ్ఞతలను కృతజ్ఞతలుగా మార్చండి

మంచు చెప్పారు...

అభినందనలు.
మీ పొస్ట్లన్నిట్లొ నాకు "తాతారావుగారి బెంజికారు" చాలా ఇస్టం.. ఒక ఐదు ఆరు సార్లు చదివి వుంటా ఆ పొస్ట్

3g చెప్పారు...

అభినందనలు. మీ పోస్ట్ లు చదువుతూ ఉంటాను మీరు గోదావరి యాసని బాగా రాస్తారు.

Sravya V చెప్పారు...

అభినందనలు !

Vinay Datta చెప్పారు...

congratulations, Srinivas garu!

Iam interested in (reading) short stories, wish to start reading yours', one fine day.

మాలా కుమార్ చెప్పారు...

congrats.

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

ఇది వ్యసనం అంటే నేను మాత్రం ఒప్పుకోను

శ్రీనివాసరాజు చెప్పారు...

@విజయ మోహన్ గారు
మార్చానండీ.. ధన్యవాదములు. :)

@మంచు-పల్లకీ గారు
మీ కామెంట్సే చెబుతుంటాయి.. మీరు రెగ్యులర్ ఫాలోవర్ అని. ధన్యవాదములు. :)

@3g గారు.
నా గోదావరి మాండలీకం నచ్చినందుకు సంతోషం. మీ కామెంటుకు ధన్యవాదములు. :)

@శ్రావ్యగారు
ధన్యవాదములు :)

@మాలా కుమార్ గారు
ధన్యవాదములు :)

@జాన్‌హైడ్ కనుమూరి గారు
ఇదివొక మంచి వ్యసనం అనుకోండి పోనీ.. ఎదైమైనా నేను ఆనందిస్తున్నాను.
మీ కామెంటుకు ధన్యవాదములు :)

హరే కృష్ణ చెప్పారు...

శ్రీనివాస్ గారు

అభినందనలు

కొత్త పాళీ చెప్పారు...

Congratulations.
The recognition is well-deserved

mallikharjun varma చెప్పారు...

chala bavundi kada okka padam kuda miss kakunda chadavalani pinchindi.................danyavadamulu

Unknown చెప్పారు...

late to see but it was superb bava... nenu same kani nuv na lantivadivi ani naku ippataki thelisindhi...

Related Posts Plugin for WordPress, Blogger...