26, నవంబర్ 2010, శుక్రవారం

కార్ల బజారు...

అబ్బా నా "మారుతీ 800" కారు.. అదిరిపోయే గాడీ..
బూజుపట్టినా తగ్గని వేడి.. భలేవుందిలే దీని బాడీ.
దీనికెవ్వరూ సరిరారు జోడీ...
హమ్మో పదకొండయ్యిందా..  అయితే ఈ రోజు ఆఫీసుకు కార్లోకన్నా టూవీలర్ పైనే బెటర్.

ఇదేకదా.. "స్కార్పియో.." గున్నేనుగు లాంగుదిది.. హా.. మన సినిమాల్లో ఫ్యాక్షనిస్టులు వాడేదిది...
ఇంట్లో పెళ్ళాన్ని భయపెట్టలేనివాళ్ళు వీధిలో ప్రతాపం చూపించటానికి వాడేదీ ఇదేనా..!


హ హా.. "టాటా ఇండికా.." నాకెప్పుడూ కన్ఫ్యూజనే "టాటా ఇండీకాకీ - ఇండీకామ్" కీ.
ఇప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి.. కారు పేరు "ఇండికా.." ఫోనుపేరు "ఇండీకామ్" కదా.
ఇది చూడగానే నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. లక్షలు పోసి కొన్నాడంట మాఫ్రెండు ఫ్రెండు ఫ్రెండొకడు..
ఎక్కడకెళ్ళినా జనాలు చేతులూపేసి ఆపేస్తున్నారంట.. ఏంట్రాబాబు ఇలా ఆపేస్తున్నారు..
కారుకేమన్నా అయ్యిందా అని ఆగిచూసుకుంటే ఏమీలేదు..
ఇంతలో వాడేవడో కారు దగ్గరకొచ్చి. కిలోమీటర్ కి ఎంత.., ఏ.సీ తో ఎంతా నాన్ ఏ.సీ ఎంతా..
ఫలనా చోటికొస్తావా.. ట్యాక్సీ అన్నాడంటా..
హి హిహీ. కొన్ని బ్రాండులలా స్థిరపడిపాతాయి మరి.

ఒరే "సాంత్రో" కాస్త చూసుకుని వెళ్ళరో..  నీకంత పొగరేంట్రో.. తగ్గు తగ్గు తగ్గరో...
హత్తెరి.. దీనివెనకే.. "ఐ. టెన్.."
బిత్తెరి.. వెనకే.. "ఐ. ట్వంటీ.."
ఛత్.. "ఐ. తర్టీ..."
ఫ్లో లో అనేసా ఇంకా రిలీజ్ కాలేదుకదా.
"డేవూ మ్యాటిజ్" గాడా.. అనగ్గొట్టేసిన మూతిలావుండే మొహమూ వీడూను
ఎందుకురా "ఐ. ట్వంటీ.." వెనక అంత స్పీడుగా పోతావ్
వాడు బ్రేకేస్తే "దుబాయ్ శీను" రవితేజ అన్నట్టు నీ మూతింకా అప్పడమైపోద్దీ.

ఇదేంటిది.. "మహీంద్రా గ్జయిలో.." కొత్తగావచ్చిందనీ దీనికెంత స్టయిలో...
చూసాంలే.. ఇకచాలు ఛలో..

ఒర్నాయనో "ఇన్నోవా.." పక్కింట్లోవాళ్ళ పక్కింటొళ్ళని.. వాళ్ళవాళ్ళ ఎదురింటోళ్ళనీ
ఎక్కించినా ఇంకా ఖాలీగావుందా?
మరెందుకంటా అంత పెద్ద కారు నీకు.. స్పీడెల్తుందని అలా తెగతొక్కెయ్యమాకు...
కాస్త నెమ్మదిగా పోనీయ్యి బాబు.

హార్నీ "టవేరా.." అలా మీదమీదకొస్తావేరా... బ్రతకాలనిలేదురా?... మరెందుకంత కంగారురా?...

అరెరే.. "బెంజి.." మాంచి హైక్లాసు బెంజి.. ఎవడ్రా ఇక్కడ దార్లో పోసాడు గెంజి.
ఆ బెంజినీ ఈ గెంజినీ చూడగానే ఏదో రిలేషను గుర్తొస్తుందబ్బా.. హా...

 "గెంజి నుండి బెంజి దాకా చూసాను.. దేనినీ మర్చిపోలేను"..
 అన్న పద్మభూషణ్ చిరంజీవి గుర్తోచ్చాడేంటి చెప్మా!!.

హెల్మెట్ కారు.. హెల్మెట్ కారు.. "వేగన్ ఆరు.." చూడ్డానికలావున్నా దీనిది భలే జోరు...
ఒబెసిటీ వచ్చినవాడిలా.. నడుముకు కండపట్టినట్టుంది ఇదేం కారబ్బా..
ఓహో.. "మారుతీ స్విఫ్టా!!"
దీనికి వెనకో లగేజీ బాక్స్ కడితే  అదే "స్విఫ్ట్ డిజైర్.." శెభాష్ శెభాష్.. బాగానేవుంది.

ఈ లక్కపిడతలేంటి..
"ఆల్టో..." "జెన్" కీ నీకు తేడాఏంటో!
ఏమో నిజం చెప్తే ఎవరూనమ్మరు.. అదేంటో.

అర్రెర్రే.. ఇదింకా లక్కపిడతగాదే.. "చెవ్రల్లెట్ స్పార్కా!.."
దీనీ ఎనక కళ్ళద్దాలు రౌండు రౌండు ఎందుకో... అబ్బా పాత ఇస్టయిలు గాదే!!

ఓర్నీ "నానో..." ఇదేంటన్నో... ఇలాగుందేంటన్నో.. లచ్చకారా.. లచ్చల్లో కారా?
త్రీ-సీటర్ ఆటోకి రంగేసెయ్యలేదుగాందా??
"ఫియట్ యునో..", సారీ.. ఐ డోంట్ నో..!!

ఇదేంటి సిటీ అంతా తిరిగొచ్చిన కారులాగుంది.. "హోండా సిటీనా..."?
బాబూ డ్రైవరూ.. కాళ్ళుచాపుకునే ఖాళీవుందికదాని.. పడుకుని నడపబాకయ్యో!!

"ఫియట్ పేలియో...", వెనక్కినడపాలంటే బయటతలపెట్టి చూడాలయో..
"స్కోడా ఆక్టావియా..." నోరేతిరగట్లేదు ఇదేం పేరయా!!
"హోండా సివిక్.." మరీపడవలాగుంది లుక్... నడపటానికి డ్రైవరే దిక్కు.

"వోక్సేవేగన్ జెట్టా.."? మార్టిన్.. గుడ్ నైటేంకాదు..

"బి. ఎమ్. డబ్ల్యూ.." అయ్ బాబోయ్.. దూరం దూరం.. గీతడితే.. నా ఒకనెల సేలరీ.. దొబ్ల్యూ...
"ఆడీ.." మాతాతకేలేదు బాబూ గాడీ...!!
"స్కోడా ఫేబియా.." చిన్నకారుకెందుకంత ప్రైసియా...

"టా.. టా.. సఫారీ....", బానేవుంది జడముడేసుకెళ్తున్న ఆంటీలాగా ఎనకాలీ టైరెందుకో..
"హోండా ఏకోర్డ్..", సారీ ఐ కెన్నాట్ ఏఫోర్డ్..

"మారుతీ ఏ-స్టారు.." ఆ మిడిగుడ్ల హెడ్లైట్లేంటి మాష్టారూ??

వీడెవడుపాపం ఎనకెవడిచేతో నొక్కునొక్కించుకున్నటుంన్నాడు...
ఇది డాషిచ్చింది కాదా!!.. ఆహా.. ఇదే మోడలా..
ఓహో.. ఇది "మారుతీ రిట్జా..!!"

అంతలా హారన్ కొట్టకయా.. "ఫియట్ లీనియా".. కారుకొన్నది నీ బాబు మనీయా?

అప్పుడే.. ఆఫీసొచ్చేసిందే.. మిగతామోడల్స్ మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడేఁ.. ఏఁ..

14 కామెంట్‌లు:

మేధ చెప్పారు...

హ్హహ్హ.. కార్ల కోరు బానే ఉంది..!

శ్రీనివాసరాజు చెప్పారు...

@మేధ గారు
టపా నచ్చినందుకు సంతోషం.
మీ కామెంటుకు ధన్యవాదములు. :-)

ఆత్రేయ చెప్పారు...

బాగుంది శ్రీనివాస్ ఇంకా కొన్ని కార్లు ఉన్నాయి
ఆయినా మన సంస్కృతి చిహ్నమైన అంబాసడర్ ని ఒదిలేస్తే ఎలా అబ్బాయి
బొత్తిగా మరీ కుర్ర "కారు" వేషాలు కాక పోతే !!

అజ్ఞాత చెప్పారు...

మీ "కారుకూతలు" బాగానే ఉన్నాయి.
(తిట్టడం లేదండీ..మెచ్చుకుంటున్నాను.)

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఆత్రేయ గారు
ఈ కాలం కుర్ర'కారు' కి పాతకార్లెక్కడ కనబడతాయండీ. రోడ్డుమీదకొస్తే అన్నీ రయ్యి రయ్యిమంటూ దూసుకుపోయేవి కావాలిగానీ. ఆ కనబడ్డవే నేను రాసానుమరి..
మీ కామెంటుకు ధన్యవాదములు :-)

@బోనగిరి గారు
'కారుకూతలు' మీకు వినబడినందుకు సంతోషం :-)
కామెంటుకు ధన్యవాదములు.

ఇందు చెప్పారు...

హ్హహ్హహ్హ...భలే వ్రాసారండీ...కానీ మీరు నా స్కార్పియో ని తిట్టారు :( అది నా ఫేవరెట్...పోన్లేండీ..ఇప్పుడు నా ఫెవరెట్ 'ఫోర్డ్ మస్టాంగ్' :) కాబట్టీ లైట్.కానీ మీరు మాత్రం ప్రాసలతో భలె కామెడీ గా వ్రాసారండీ...నాకు రోడ్ మీద వెళుతుంటే ఇలా కార్లు అబ్సర్వ్ చేయడం ఒక అలవాటు :) కానీ మీలాగ ఇలా వ్రాయొచ్చు అని మాత్రం తట్టలేదు :) చాల బాగుంది మీ టపా

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఇందు గారు
నా కార్లగోలని అర్ధంచేసుకున్నందుకు సంతోషం. నేనూ అలా కార్లు అబ్జర్వ్ చేసీ చేసి ఇలాంటివన్నీ తెలిసాయి. చాలామందికి నేను రాసింది అర్దంకాలేదని నా భావన.
ఇది ఎన్నాళ్ళఅనుభవమో... అర్ధంచేసుకోరూ.. :-)

మీ కామెంటుకు ధన్యవాదములు.

కౌటిల్య చెప్పారు...

రాజు గారూ..మీ కియేటివిటీ కి శతకోటి మంగిడీలు..మీ అబ్జర్వేషన్కి కూడా...ః)

అన్నిటికన్నా ఇండికా సెటైరు సూపరు....
హమ్మయ్య నా "ఫోర్డ్ ఫిగో" జోలికెళ్ళలేదు..భలే మంచోళ్ళు..అయినా మీ "ఎనిమిదొందల మారుతి"ని తెగపొగుడుకున్నారు,మరి స్కూటరు మీద ఎందుకటా వెళ్ళటం..ఎంతైనా స్వజన పక్షపాతం..ః))

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్య గారు
మీ మంగిడీలకు నా మంగిడీలు.

ఫోర్ట్ ఫీగో నాకుకూడా నచ్చినకారే.. నాకుఎదురురాలేదు కాబట్టి ఏమీ అనలేదు.

ఎంతైనా మా ఎనిమిదొందల మారుతీ మారుతీనే..
ట్రాఫిక్లో బి.యమ్.డబ్ల్యూ అయినా ఒకటే.. బోయింగ్ విమానమైనా ఒకటే.. అందుకే టూవీలరే బెస్ట్ అని.

మంచు చెప్పారు...

హ హ.... టాటా సఫారీ బావుంది :-))

swathi చెప్పారు...

ఇంటర్మీడియట్ చదివే మా అబ్బాయికి కార్ల పిచ్చి. వాటి గురించి మాట్లాడుతుంటాడు. ఒకసారి నేను అన్నాను. ఎందుకన్ని కోట్లు పోసి రోల్ల్స్ రోఇస్
కొంటారు. వంద మారుతీ కార్లు వస్తాయి కదా అంటే, మా అబ్బాయి అన్నాడు , అమ్మ ఇక ఎప్పుదూ కార్ల గురించి మాట్లాడకు అని

శ్రీనివాసరాజు చెప్పారు...

@మంచు గారు
టపా నచ్చినందుకు సంతోషం. :-)
అన్ని పోలికలూ వదిలేసి.. ఆంటీజడముడితో పోల్చినదే నచ్చిందేంటబ్బా.. అసలెందుకబ్బా.. ;-)

@స్వాతిగారు.
హ హా..హా.. బాగుంది.

శ్రీనివాసరాజు చెప్పారు...

@కొత్తపాళీ గారు
ధన్యవాదములు. :-)

Unknown చెప్పారు...

"వోక్సేవేగన్ జెట్టా.."? మార్టిన్.. గుడ్ నైటేంకాదు..

Excellent!!!!! hahaha

Related Posts Plugin for WordPress, Blogger...